Advertisement
ఆహార పదార్ధాలలో ఉండే కొన్ని కొన్ని వింతలు మనకు ఆశ్చర్యంగా ఉంటాయి. పెరుగు ఎందుకు పులుస్తుంది…? పాలు ఎందుకు పులియవు… ఇలాంటివి అన్నీ ఆసక్తికర విషయాలే. ఇక ఇడ్లీ పిండి మనం దాన్ని రుబ్బి మూత వేసి పెడితే ఉదయానికి పొంగుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అనే కారణం చాలా మందికి తెలియదు. అసలు అందులో జరిగే రసాయన చర్య ఏంటీ అనేది కూడా ఆసక్తికరమే. దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:అర్హత లేకపోయినా ఇండియా క్రికెట్ టీంలో ఉన్న ఆటగాళ్ళు…!
Advertisement
ఇడ్లీ పిండి పులియడం వల్లనే అలా పొంగుతుంది. అలా పులియడానికి కారణం ఈస్ట్ అనే బ్యాక్టీరియా. పాలు పెరుగు అయ్యేది కూడా ఆ బ్యాక్టీరియా కారణంగానే. బ్యాక్టీరియా అంటే అదేదో క్రిమి కాదు అండి… అది ఉండాల్సిన స్థాయిలో ఉంటే మనకు మంచి చేస్తుంది. వాస్తవంగా మాట్లాడితే వెంటనే రుబ్బిన పిండి ఇడ్లీ వేస్తే చండాలంగా ఉంటుంది. తినడానికి పచ్చి పిండి తిన్నట్టే ఉంటుంది.
Advertisements
అలా కాకుండా పులిసిన పిండితో ఇడ్లీ, దోశలు వేస్తే చాలా రుచిగా ఉంటాయి. అందుకనే రుబ్బిన పిండిని ఒక రాత్రి అలా పులియనిచ్చి తర్వాత రోజు నుంచి ఇడ్లీ, దోశకి వాడుతూ ఉంటారు. అయితే ఆ పిండి ఎక్కువ పులియకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఉంచితే ఆ ప్రభావం నుంచి బయటపడుతుంది. ప్యాకెట్లో ఉండే పిండి ఇంకా వేగంగా ఉబ్బిపోతుంది. దానికి కారణం మూసి ఉన్న వాతావరణంలో ఈస్ట్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది.
Advertisements
Also Read:రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగా ఉంటాయి…?