Advertisement
సాధారణంగా మనలో చాలా మందికి మెడ విరిచే అలవాటు ఉంటుంది. కొందరు ఊరికే అదే పనిగా మెడలు విరుచుకుంటుంటారు. బాగా పనిచేసి ఒత్తిడిలో ఉన్నప్పుడు, అలసి పోయినప్పుడు మెడ విరిస్తే కొద్దిగా రిలాక్సేషన్ లభిస్తుందని అనుకుంటారు. ఇక చాలా మంది సెలూన్లలో కటింట్ లేదా మసాజ్ చేయించుకున్నప్పుడు బార్బర్లచే మెడలు విరిపించుకుంటారు. అయితే ఎక్స్‌పర్ట్స్ అయితే ఫర్వాలేదు. కానీ అది వికటిస్తే మెడ నరాలు దెబ్బ తినేందుకు అవకాశం ఉంటుంది.
Advertisement
ఇక మెడలు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుందంటే.. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు మెడ విరిస్తే సహజంగానే ఒక పాపింగ్ సౌండ్ వినిపిస్తుంది. క్రాక్ అయినట్లు శబ్దం వినిపిస్తుంది. దీంతోపాటు జాయింట్లలో ఉండే ద్రవపదార్థం, గాలి ఒక్కసారిగా బయటకు వస్తే క్రాక్ అయినట్లు శబ్దం వినిపిస్తుంది. మనం జాయింట్లను స్ట్రెచ్ చేసినప్పుడు వాటిల్లో ఉండే ద్రవపదార్థం, గాలి సడెన్‌గా బయటకు వస్తాయి. దీంతో క్రాకింగ్ శబ్దం వినిపిస్తుంది.
ఇక జాయింట్లలో లిగమెంట్లు, టెండన్లు అనబడే పోగులలాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి కండరాలు, ఎముకలకు కనెక్ట్ అయి ఉంటాయి. మనం మెడలు విరిచినప్పుడు ఇవి సాగుతాయి. మెడను సాధారణ స్థితికి తేగానే క్రాకింగ్ లాంటి శబ్దం వినిపిస్తుంది. అందుకనే మెడలు విరిచినప్పుడు మనకు శబ్దాలు వినిపిస్తాయి. అయితే మెడలు విరవడం అనేది శ్రేయస్కరం కాదు. ఒక్కోసారి అక్కడి లిగమెంట్లు లేదా ఎముకలకు హాని కలుగుతుంది. దీంతో స్ట్రోక్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
Advertisements