Advertisement
కార్ల వాడకం గతంతో పోలిస్తే చాలా బాగా పెరిగింది అనే చెప్పాలి. కార్ల కొనుగోలు కి సంబంధించి చాలా మందికి అవగాహన లేదనే చెప్పాలి. లగ్జరీ కార్లు ఎందుకు కొనాలి…? నార్మల్ కార్లు ఎందుకు కొనాలి అనేది చాలా మందికి తెలియదు. అసలు లగ్జరీ కార్లలో ఏయే సౌకర్యాలు ఉంటాయో ఒకసారి చూద్దాం.
Also Read: ఇన్వర్టర్ ఏసీకి సాధారణ ఏసీకి తేడా ఏంటీ…?
కార్ లో వుండే అద్దాల బ్రైట్నెస్ తగ్గించుకోవడం పెంచుకోవడం ద్వారా బయట నుండి వచ్చే వేడిని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారికీ అనుకూలంగా సీట్ మసాజర్ కూడా ఉంటుంది. వెన్టిలేటెడ్ సీట్స్ కూడా ఉంటాయి. ఇవి మన దేశంలో తయారయ్యే కార్లలో కూడా ఉంటున్నాయి. రోడ్డు మీద వున్న గుంతలు గోతులను అనుసరించి సస్పెన్షన్ మార్చుకునే సౌకర్యం కూడా ఉంటుంది.
Advertisement
Advertisements
కార్ ఒక లైన్ లో వెడుతున్న సమయంలో… పొరపాటున వేరే లైన్ లోకి కారు వెళ్తే స్టీరింగ్ వైబ్రేట్ అవుతుంది. ద్హీనితో డ్రైవర్ ను హెచ్చరిస్తుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా పార్క్ చెయ్యడం కూడా ఉంటుంది. ఆటోమేటిక్ గా తలుపులు ముసుకోడం తెరచుకోడం జరుగుతూ ఉంటాయి. స్టీరింగ్ వీల్ టెంపరేచర్ కంట్రోలర్ ఉంటుంది. కార్ లో బిల్ట్ ఇన్ వాక్యూమ్ క్లీనర్ ఇస్తారు. కార్ లోపల ఆకాశం చంద్రుడు స్టార్స్ వుండేలా రూఫ్ తయారు చేస్తారు. డ్రైవర్ లేకుండా ప్రి ప్రోగ్రామ్ తో నడిచే విధంగా ఉంటున్నాయి.
Advertisements
Also Read: రెండు వేల నోటు ఎందుకు ముద్రించట్లేదు…?