Advertisement
ప్రపంచంలో ఏ విమానం అయినా సరే ఒకే సరళ రేఖలో ప్రయాణించదు. చాపంలాంటి మార్గంలో ప్రయాణిస్తుంది. ఎందుకంటే అలా వెళ్తేనే తక్కువ దూరం వస్తుంది. అందుకనే విమానాలు స్ట్రెయిట్ లైన్‌లో వెళ్లవు. అయితే విమానాలు సాధారణంగా హిమాలయాల మీద నుంచి ప్రయాణించవు. అవును.. నిజమే.. అందుకు గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
* విమానాలు సహజంగానే సముద్రాలు, పర్వతాలను తప్పించకుని సమతల ప్రదేశం మీదుగా ప్రయాణం చేస్తాయి. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ అయితే విమానాన్ని ల్యాండ్ చేయించాలంటే పర్వతాలు, సముద్రాల మీదుగా ప్రయాణిస్తే కుదరదు కదా. సమతలం మీదుగా ప్రయాణిస్తేనే ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక హిమాలయాలే కాదు, ప్రపంచంలో ఏ పర్వతం మీద నుంచైనా సరే సాధారణంగా విమానాలు ప్రయాణించవు.
* హిమాలయాల మీదుగా విమానాలు ప్రయాణించకపోవడానికి మరొక కారణం.. ఆ ప్రాంతంలో చైనా, భారత్ ఆర్మీలు సైనికులకు శిక్షణ కార్యక్రమాలను క్యాంపుల్లో నిర్వహిస్తుంటాయి. కనుక ఆ ప్రదేశంపై విమానాలు ప్రయాణించడాన్ని నిషేధించారు. కనుకనే విమానాలు హిమాలయాల మీదుగా ప్రయాణించవు.
Advertisements
Advertisement
* విమానం సాధారణంగా 30వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. అక్కడ ఆక్సిజన్‌కు ఇబ్బంది అయితే విమానంలో ఎమర్జెన్సీ ఆక్సిజన్ ఉంటుంది. కానీ అది 20 నిమిషాల్లో అయిపోతుంది. కనుక ఆ సమయంలోగా విమానం 10వేల అడుగుల దిగువకు రావాలి. దీంతో ఆక్సిజన్ మళ్లీ లభిస్తుంది. అయితే హిమాలయాల ఎత్తు 20వేల అడుగుల వరకు ఉంటుంది. అలాంటి ప్రదేశంలో 10వేల అడుగుల ఎత్తుకు విమానం రావాలంటే విమానం పర్వతాలను ఢీకొట్టాల్సి ఉంటుంది. అది ఆత్మహత్యా సదృశమనే చెప్పవచ్చు. కనుక ఇలాంటి రిస్క్ ఎందుకని చెప్పి పైలట్లు విమానాలను హిమాలయాల మీదుగా నడిపించరు.
Advertisements
* హిమాలయాలే కాదు, ఇతర పర్వత ప్రాంతాల్లోనూ పై భాగంలో గాలి ఒత్తిడి, ప్రవాహం సరిగ్గా ఉండదు. అసాధారణ రితీలో గాలి ప్రయాణిస్తుంది. అసాధారణ వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా ఏర్పడుతాయి. కనుక అలాంటి సందర్భాల్లో విమానం టర్బులెన్స్‌కు గురవుతుంది. అంటే.. ఆయా కారణాల వల్ల విమాన ప్రయాణంలో మార్పులు వస్తాయి. విమానం షేక్ అవుతుంది. కనుక విమానం టర్బులెన్స్‌కు గురి కాకుండా ఉండేందుకు దాన్ని పర్వతాల పై భాగంలో నడిపించరు.
* హిమాలయాల వద్ద అన్ని ఇబ్బందులను తట్టుకుని పైన విమానాలను నడిపించినా అక్కడ రేడార్ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. అంతేకాదు విమానంలో ఉండే సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌లోని వారితో కమ్యూనికేట్ అయ్యేందుకే సాంకేతిక సమస్యలు ఏర్పడుతాయి. వారు దారి తప్పే అవకాశం ఉంటుంది. కనుక హిమాలయాల మీదుగా వెళ్లేందుకు ఏ పైలట్ సాహసించడు.