Advertisement
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అనేక దేశాలకు తమ తమ సొంత శాటిలైట్లు ఉన్నాయి. పలు భిన్న రకాల శాటిలైట్లను ఆయా దేశాలు వివిధ రకాల పనుల కోసం ఉపయోగిస్తున్నాయి. అయితే భారత్‌కు చెందిన శాటిలైట్లతో తీసే భూమి చిత్రాల కన్నా.. విదేశీ శాటిలైట్లతో తీసే చిత్రాలే స్పష్టంగా వస్తాయి. ఇప్పటి వరకు మనం ఆ విషయాన్ని గమనించాం కూడా.. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ? భారత్ వద్ద నాణ్యతతో ఫొటోలు తీసే శాటిలైట్లు లేవా ? అంటే.. ఉన్నాయి.. అవును.. కానీ దాన్ని గత ఏడాదే భారత్ ఉపయోగించడం మొదలు పెట్టింది. అందుకనే గతంలో భారత శాటిలైట్లతో భూమిని తీసే చిత్రాలు నాసిరకంగా వచ్చేవి. కానీ ఇప్పుడలా కాదు.. మనకూ ఇస్రో ప్రయోగించిన కార్టోశాట్-3 అనే శాటిలైట్ వల్ల అత్యంత నాణ్యత, స్పష్టతతో కూడిన భూమి చిత్రాలు వస్తున్నాయి.
పైన చిత్రంలో ఉన్నది ఇస్రో కార్టోశాట్-3 శాటిలైట్‌తో తీసిందే. 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో 25 సెంటీమీటర్ల రిజల్యూషన్‌తో ఆ చిత్రాన్ని తీశారు. కాగా ఆ శాటిలైట్ ప్రస్తుతం భూ దిగువ కక్ష్యలో ఉంది. ఇక గతంలో అమెరికాకు చెందిన వరల్డ్ వ్యూ 4 శాటిలైట్ 13.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో 31 సెంటీమీటర్ల రిజల్యూషన్‌తో భూమి చిత్రాలను తీసేది. ఆ శాటిలైట్‌ను అమెరికాకు చెందిన మాక్సార్ అనే కంపెనీ ప్రయోగించింది. కానీ ఇప్పుడు మాత్రం మనకు ఇస్రోకు చెందిన కార్టోశాట్-3 సేవలు అందిస్తోంది.
Advertisement
ఇస్రో కార్టోశాట్-3 శాటిలైట్‌ను ప్రస్తుతం కార్టోగ్రాఫిక్ అప్లికేషన్లు, అర్బన్, రూరల్ అప్లికేషన్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, కోస్టల్ ల్యాండ్ యూజ్ అండ్ రెగ్యులేషన్, యుటిలిటీ మేనేజ్‌మెంట్, వాటర్ గ్రిడ్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్, క్రియేషన్ ఆఫ్ ల్యాండ్ యూజ్ మ్యాప్స్ అవసరాల కోసం వాడుతున్నారు. కాగా కార్టోశాట్-3ని ఇస్రో గతేడాది నవంబర్ 27న ప్రయోగించింది.
అయితే ప్రస్తుతం ఫోన్లలో నాసాకు చెందిన జీపీఎస్‌ను ఎక్కువగా వాడుతున్నారు. కానీ త్వరలో ఇస్రోకు చెందిన నావిక్ యాప్‌ను జీపీఎస్‌కు బదులుగా వాడనున్నారు. నావిక్ యాప్ కూడా జీపీఎస్ లాగే పనిచేస్తుంది. కానీ శాటిలైట్ మనదే అవడం వల్ల కచ్చితత్వం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇందుకు గాను స్మార్ట్‌ఫోన్లలో ఐఆర్ఎన్ఎస్ఎస్ అనే హార్డ్‌వేర్ రిసీవర్ ఉండాలి. అయితే ఈ హార్డ్‌వేర్ ఉన్న ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో లేవు. త్వరలో షియోమీ ఈ హార్డ్‌వేర్‌తో ఫోన్లను లాంచ్ చేయనుంది. దీంతో ఆ ఫోన్లలో ఇస్రో నావిక్ యాప్‌ను జీపీఎస్‌కు బదులుగా ఉపయోగించుకోవచ్చన్నమాట..!
Advertisements
Advertisements