Advertisement
విమానాల్లో వాటి అడుగు భాగంలో ఇంధన ట్యాంకులు ఉంటాయని, వాటిల్లోనే ఇంధనం నింపుతారని చాలా మందికి తెలుసు. కానీ నిజానికి విమనాల్లో ఉండే రెక్కల్లోనూ ఇంధనం నింపుతారు. అవును.. నిజమే. విమానాల రెక్కలు, వెనుక తోక భాగంతోపాటు కింది వైపు ఉండే ట్యాంక్.. ఇలా మొత్తం 3 భాగాల్లో ఇంధనం నింపుతారు. అయితే కింది వైపు ఉండే ట్యాంకులో ఇంధనం నింపితే చాలు కదా.. మళ్లీ రెక్కల్లో ఇంధనం నింపడం ఎందుకు ? అంటే…
విమానాల రెక్కల్లో ఇంధనం నింపకపోతే అవి తేలిగ్గా ఉంటాయి. దీంతో అవి టేకాఫ్ అయ్యేటప్పుడు పై దిశగా వంగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి రెక్కలు డ్యామేజ్ కావు. కానీ దాని వల్ల లోపల ప్రయాణించే వారికి ఇబ్బందులు కలుగుతాయి. అదే విమాన రెక్కల్లో ఇంధనం ఉంటే ఆ బరువుకు రెక్కలు పైకి వంగకుండా ఉంటాయి. దీన్నే వింగ్ బెండింగ్ రిలీఫ్ అని, వింగ్ ఫ్లెక్స్ అని అంటారు. ఇంధనం నింపడం వల్ల ఆ బరువుకు విమాన రెక్కలు పైకి బెండ్ కాకుండా ఉంటాయి. దీంతో విమానం లోపల ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది.
Advertisement
అయితే విమానంలో ఇంధనాన్ని నింపేటప్పుడు మాత్రం ముందుగా రెక్కల్లోనే నింపుతారు. చివరకు కింది ట్యాంకులో ఇంధనం నింపుతారు. ఇక దాన్ని ఉపయోగించేటప్పుడు ముందుగా కింది ట్యాంకులోని ఇంధనాన్ని ఖాళీ చేస్తారు. తరువాత రెక్కల్లోని ఇంధనాన్ని ఉపయోగించుకుంటారు. ఈ క్రమంలో ఆ ఇంధనం అయిపోయే లోపు విమానం గమ్యస్థానానికి చేరుకుంటుంది. లేదా ఇంధనం మిగిలి ఉన్న కెపాసిటీని బట్టి మళ్లీ అందులో ఇంధనాన్ని పైన తెలిపిన విధంగా నింపుతారు. ఇలా విమానంలో ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీని వల్ల రెక్కలపై భారం పడకుండా ఉంటుంది. కానీ రెక్కల్లో చాలా భాగం ఖాళీగా ఉంటుందని, అందువల్లే ఇంధనాన్ని నింపుతారని కొందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. పైన తెలిపిన విషయమే నిజం.
Advertisements
Advertisements
చాలా వరకు విమానాల్లో కొన్ని లక్షల లీటర్ల ఇంధనం పడుతుంది. ఉదాహరణకు ఎయిర్‌బస్ ఎ380 విమానాన్ని తీసుకుంటే అందులో రెక్కల్లో 120 టన్నుల (1.50 లక్షలు) ఇంధనం పడుతుంది. అదే వెనుకవైపు తోక భాగంలో 18 టన్నుల (22,500 లీటర్లు) ఇంధనం పడుతుంది. ఇక మొత్తంగా 258 టన్నులు లేదా 3,22,500 లీటర్ల ఇంధనం ఆ విమానంలో పడుతుంది.