Advertisement
నేను చూసిన ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎక్కువలో ఎక్కువగా సింధూరం కలర్ లోనే ఉన్నాయి. ఎందుకిలా? అని చాలా మందిని అడిగాను….వాళ్లు ఏవేవో పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఫైనల్ గా గుగూల్ ను అడిగితే ఇతిహాస సంబంధమైన లాజికల్ గా ఉన్న ఆన్సర్ దొరికింది…అదే ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.
Advertisement
‘ఒకసారి సీతా దేవి నుదుటిపై సింధూరం బొట్టు పెట్టుకుంటుండగా….హనుమంతుడు ఎందుకీ సింధూరమ’ని అడిగాడట! దానికి సీతాదేవి “నా రాముడు సుఖంగా ఉండాలని కోరుతూ ఇలా పెట్టుకున్నాన”ని చెప్పిందట..ఆ మాట వినిన వెంటనే హనుమంతుడు ఒంటినిండా అదే రంగును పూసుకున్నాడట.! రాముడికి అన్ని విషయాల్లో జయం కలగాలని…రాముడిని ఆరాధించడంలో సీతాదేవితో పోటీ పడుతూ….!
ఇక్కడ సింధూరంతో మంచి జరుగుతుందా లేదా అనే చర్చ పక్కకు పెడితే….ఒక వ్యక్తిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా? అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది. తమ అనుకున్న వాళ్లకు మంచి జరగడం కోసం ఇంతలా చేస్తారా ? అనేదే అసలు విషయం.
Advertisements