Advertisement
సాధారణంగా చాలా మంది భక్తులు ఏడాదిలో రెండు సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలల్లో రెండు సార్లు హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. అయితే జయంతి అంటే ఒక్కటే రోజు ఉంటుంది కదా.. మరి రెండు సార్లు జయంతిని ఎందుకు నిర్వహిస్తారు ? అంటే.. నిజానికి ఒక రోజు జయంతి కాదు. అయినా దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, కనుకనే ఆ రోజును జయంతిగా నిర్వహిస్తున్నారు. కానీ నిజానికి హనుమాన్ జయంతిని ఒక్క రోజే నిర్వహించాలి.
హనుమంతుడు సీతను లంకలో మంగళవారం వేకువజామునే చూస్తాడు. ఆ రోజు పౌర్ణమి. చైత్ర మాసం, చిత్ర నక్షత్రం. ఆ రోజే హనుమంతుడు లంకలో అశోక వాటికను దహనం చేస్తాడు. ఎంతో మంది రావణ సైన్యాన్ని సంహరిస్తాడు. తరువాత లంకలో రావణుడి సైనికులు హనుమంతుడి తోకు నిప్పు అంటిస్తారు. దీంతో హనుమంతుడు లంకా దహనం చేస్తాడు. ఆ రోజును హనుమద్ విజయంగా భావిస్తారు. అది ఏటా ఏప్రిల్ నెలలో వస్తుంది. అందువల్ల ఆ రోజును హనుమంతుడు విజయం సాధించిన రోజుగా జరుపుకోవాలి. కానీ కొందరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అందువల్లే ఆ రోజును హనుమాన్ జయంతిగా నిర్వహిస్తున్నారు. కానీ నిజానికి హనుమంతుడు జన్మించింది ఆ తరువాత నెలలో.
Advertisement
Advertisements
Advertisements
ఏటా మే నెలలో వచ్చే హనుమాన్ జయంతిని ఆయన పుట్టినరోజుగా జరుపుకోవాలి. వైశాఖ మాసంలో శుక్ల దశమి నాడు శనివారం హనుమంతుడు జన్మించాడు. ఆ రోజు పూర్వా భాద్రపద నక్షత్రం. ఆ రోజు ఏటా మే నెలలో వస్తుంది. కనుక మే నెలలో వచ్చే హనుమాన్ జయంతే అసలు జయంతి. ఆ రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకోవాలి. కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల రెండు సార్లు హనుమాన్ జయంతిని నిర్వహిస్తున్నారు. అదీ అసలు విషయం..!