Advertisement
KGF అనగానే ఎవరికైనా సరే ముందుగా గుర్తుకు వచ్చేది.. దాని పేరిట వచ్చిన మూవీ.. సినిమాలో ఆ మైన్లను చూపిస్తారు. కానీ నిజానికి ఇక్కడ చెప్పబోయేది ఆ మూవీ గురించి కాదు. కోలార్‌లో ఉన్న బంగారు గనుల గురించి. 19వ శతాబ్దం నుంచే అక్కడ బంగారం తవ్వకాలు మొదలుపెట్టారు. మన దేశానికి ఉన్న ముఖ్యమైన బంగారు గనిగా KGF (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) పేరుగాంచింది. అయితే అంతటి పేరున్న గనిని కేంద్రం ఎందుకు మూసివేసింది ? బంగారం తవ్వి తీయవచ్చు కదా ? అంటే…
KGF లో గోల్డ్ ఉందని ఎలా తెలిసింది?:
ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మైకేల్ 1804వ సంవత్సరంలో ప్రచురితం కాబడ్డ ఓ 4 పేజీల ఆర్టికల్ లో కోలార్‌లో బంగారు నిక్షేపాలున్నాయని చదివాడు దాంతో 1871లో ఆయన తన మకాంను బెంగళూరుకు మార్చాడు. ఆ తరువాత కొంత కాలానికి కోలార్ గనుల్లో బంగారం తవ్వకాలు ప్రారంభించాడు. ఇలా ఈ విషయం తెల్సుకున్న బ్రిటీష్ ప్రభుత్వం… అక్కడ అభివృద్ది పేరుతో బంగారాన్ని కొల్లగొట్టే ప్లాన్ వేసింది.
Advertisements
అనుకున్నదే తడవుగా…. 1900వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కోలార్‌లో కావేరి నదిపై జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు మైసూర్ మహారాజుకు ఓ ప్రతిపాదన పంపింది. దీనికి ఆయన కూడా ఒప్పుకున్నారు. దీంతో వడి వడిగా పనులు జరిగి విద్యుత్ కేంద్రం ఏర్పాటైంది. మొత్తం 148 కిలోమీటర్ల విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన విద్యుత్ లైన్లు కలిగిన ప్రాంతంగా కోలార్ పేరుగాంచింది. ఇక ఆ పవర్ ప్లాంట్ దేశంలోనే మొదటి పవర్ ప్లాంట్ కాగా.. ఆసియాలో రెండోది.
Advertisement
కోలార్ ప్రాంతంలోకి విద్యుత్ రావడంతో పగలు రాత్రి తేడా లేకుండా బంగారాన్ని తవ్వుకున్నారు. కోలార్ ప్రాంతమంతా బ్రిటిష్ వారితో నిండిపోయి చిన్నపాటి ఇంగ్లండ్‌ను తలపించేది. ఎటు చూసినా బంగ్లాలే కనిపించేవి. కానీ అక్కడి గనుల్లో పనిచేసే భారతీయులు మాత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో దుర్భర పరిస్థితిలో నివాసం ఉండేవారు.
1956 అనంతరం కోలార్ బంగారు గనులు జాతీయ0 అయ్యి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లాయి. అప్పటి నుంచి 2001 వరకు ఆ గనులలో తవ్వకాలు కొనసాగాయి. మొత్తం భారత్‌లో ఉత్పత్తి అయ్యే బంగారంలో కేవలం ఆ గనుల నుంచే 95 శాతం వరకు బంగారం వచ్చేది. కానీ 2001లో ఆ గనులను మూసేశారు. తరువాత అక్కడ గనులన్నీ భూగర్భ జలాలతో నిండిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఆ గనులను ఓపెన్ చేసి బంగారం తవ్వాలని పలువురు కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే కోలార్ గనుల్లో బంగారం నిల్వలు ఇంకా ఉన్నప్పటికీ.. ఆ బంగారాన్ని తవ్వి తీయాలంటే.. ఆ బంగారం కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందట. అందుకనే ఆ గనులను అప్పట్లో మూసేశారు. అప్పటి నుంచి అక్కడ తవ్వకాలను జరపడం లేదు. అలా 2001 నుంచి ఆ గనులు మూసే ఉన్నాయి. ఆ విధంగా కేజీఎఫ్ గనుల అధ్యాయం ముగిసింది..!
Also Read : 6th క్లాస్ ఫ్రెండ్ కు 15 కోట్ల జీతం, ఇంజనీరింగ్ ఫ్రెండ్ కు 10 కోట్ల జీతం.! అంబానీ స్నేహం ఇలా ఉంటుంది.!
Also Read : రెండు కళ్లు తీసేశారు…అయినా రెండు లైన్ల కవిత్వం ఆధారంగా మహ్మద్ ఘోరిని తుదముట్టించాడు. పృథ్వీరాజ్ గాథ.!
Also Read : ఆమె చీర ఎత్తి మరీ చేతిని చూపడం వెనుక అద్భుతమైన సందేశం ఉంది. అదేంటంటే..!
Advertisements
Also Read : 6 ఏళ్ళ క్రితం….ఓ కుర్రాడితో వెళ్ళిపోయిన కూతురి గురించి తండ్రి మాటలు.!!