Advertisement
1982 మార్చి 28…ఇందిరా గాంధీ లండన్ నుండి తన ఇంటికి తిరిగొచ్చారు. సోనియా గాంధీ, మేనకా గాంధీ, రాహుల్ , ప్రియాంక, వరుణ్ అందరూ ఆమెకు స్వాగతం పలికారు. వచ్చీ రావడంతోనే…. మేనకాను ఉద్దేశించి..”నేను నీతో తర్వాత మాట్లాడుతా”నంటూ తన రూమ్ లోకి వెళ్లిపోయారు ఇందిరా గాంధీ.!
ఆ రోజు మద్యాహ్నం మళ్లీ..మేనక తో “నువ్వు నీ రూమ్ లోనే ఉండు లంచ్ అక్కడికే వస్తుంది. నువ్వు డైనింగ్ హాల్ కి రావాల్సిన అవసరం లేద”ని చెప్పిందట!
కారణం : 27 మార్చి న..లక్నోలో మేనకా గాంధీ ఓక స్పీచ్ ఇచ్చారు. అందులో 1980 నుండి భారతదేశంలో పెరిగిన అవినీతిని మనందరం నిర్మూలించాలని అన్నారట.! ( 1980 నుండి అధికారంలో ఉన్నది ఇందిరా గాంధీనే ) అంతకంటే ముందునుండే…ఇందిరా గాంధీ మేనకా గాంధీ వెనుక ఇంటెలీజెన్స్ బ్యూరోను నియమించారట…ఆమె టెలిఫోన్ మాటలు కూడా రికార్డ్ చేయబడేవట.!
Advertisement
మరల రాత్రి 12 గంటల ప్రాంతంలో…. మేనక గదిలోకి వెళ్లిన ఇందిరా గాంధీ “నీ వీడియో అంతా చూశాను..నువ్వు ఇంటిలోంచి వెళ్లిపో” అనిందట.! అప్పటికే అత్త మీద కోపంతో ఉన్న మేనక 2 ఏళ్ల తన కుమారుడు వరుణ్ గాంధీని తీసుకొని ఇంటినుండి బయటికొచ్చేసిందట!
Advertisements
Advertisements
BY: Swatanshu Shekhar Singh