Advertisement
మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 తులాలు అని చెప్తారు. అసలు తులం అంటే ఏంటీ…? తులం అనేది ఒకప్పటి వేద కొలత . ఇది సంస్కృత పదం తొల నుండి రూపాతంతరం చెంది తులంగా వచ్చింది. దీని అర్ధం బరువు కొలమానం. ఒక తులం వేద కొలత ప్రకారం చూస్తే… 11.663 గ్రాములు అన్నట్టు. కొలిచే బరువులు 10 గ్రాములు , 50 గ్రాములు , 100 గ్రాములుగా ఉంటాయి.
Also Read:హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!
11.663 గ్రాముల (తులం) కొలవడానికి సాధారణ 10,50,100 గ్రాముల బరువులతో కుదరదు. ఇలాంటి సమయంలో 11.663 గ్రాములతో నాణెం తయారీ చేసుకొని దానితో బంగారం కొలిచి ఉండవచ్చు. 1956 తర్వాత ఈ కొలమానం స్థానంలో మెట్రిక్ కొలమానాలు వచ్చేసాయి. అయితే ఇప్పుడు బంగారం 1 తులం అంటే 10 గ్రాములు. ఇప్పుడు వెయింగ్ మెషిన్ లో కొలుస్తున్నారు. ముందు కాలంలో బంగారాన్ని సవర్లలో కూడా కొలిచేవారు.
Advertisement
ఆ సవర్ల కోసం గానూ… లక్ష్మి కాసుని పెట్టి బంగారాన్ని తూసేవారు, ఒక కాసు 8 . 5 గ్రాముల బంగారంతో సమానం. హైదరాబాద్ లో కాసు అంటే 10 గ్రాములు. అప్పట్లో అలా 12 కాసులు తూయడంతో… సుమారు 100 గ్రాముల బంగారం వచ్చేది. అప్పటి లెక్కల ప్రకారం ఇది ఒక సవర. ఇలా సవర వల్ల అప్పట్లో తరుగు తక్కువగా ఉండేది. అలా తూచే పద్ధతి మారి… కాల క్రమంలో ఇది తులాలల్లో తూయడం ప్రారంభించారు. ఒక తులాన్ని 11.66 గ్రాములుగా కట్టి… ఒక రూపాయి నాణెం పెట్టేవారు. అది కాసుకు అనుగుణంగా పాత నాణెం సుమారు 7.12 గ్రామ్స్ ఉండేది. దాన్ని కాసుకు అనుగుణంగా అప్పట్లో రీప్లేస్ చేసారు.
Advertisements
Advertisements
Also Read:రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!