Advertisement
భారతదేశంలో ఉండే కొన్ని సాంప్రదాయాలు మనల్ని ఎంతగానో భయపెడుతూ ఉంటాయి. పెళ్ళికి వెళ్ళే ముందు నల్ల కుక్క, నల్ల పిల్లి ఎదురు రావడం మంచిది కాదు, లేదా బయటకు వెళ్ళే ముందు వితంతువు ఎదురు రావడం మంచిది కాదనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు నిజంగా వితంతువు ఎందుకు ఎదురు రావడం మంచిది కాదు…?
Also Read:బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?
అప్పట్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. వయస్సు మీరిన మగవాళ్లతో జరిగి ప్రతీ ఇంట్లోనూ వితంతువులు కనపడుతూ ఉండేది. వారిని చూడగానే ఒకరకమైన భయం ఏర్పడేది. ఎవరైనా బయటకు వెళ్తే వాళ్ళను చూసి కన్నీళ్లు పెట్టుకునే వారు. ఇక వాళ్ళను చూస్తే ఇంట్లో ఉన్న చెల్లో, అక్కో, అత్తో, పిన్నో మరెవరో వితంతవు గుర్తు వచ్చి, మనస్సు వికలమై భయపడే పరిస్థితి వచ్చేది.
Advertisement
Advertisements
దీనితో బయటకు వెళ్లి… చేయాలి అనుకునే పని మీద ఫోకస్ చేయలేం అని భయపడే వారు. అది కాల క్రమేణా… అసలు విషయం వదిలేసి దాన్ని దరిద్రం, అశుభం అనే మాటలతో పూర్తి చేసి ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవంగా మాట్లాడితే బయటకు వెళ్తే పాజిటివ్ మైండ్ తో వెళ్ళాలి. మన ఇంట్లో వితంతువు ముఖాన్ని ఉదయమే చూడాల్సి వస్తే వాళ్ళను ఇబ్బంది పెడతామా…? వెధవలు ఎదురు వస్తే తప్పుగాని విధవలు వస్తే తప్పేం ఉంది. మన మైండ్ ని బట్టి ఉంటుంది గాని ఎవరో ఎదురు వస్తే ఉండదు.
Advertisements
Also Read:హారతి కళ్ళకు అద్దుకోవడం మంచిదా…? అద్దుకుంటే ఏం జరుగుతుంది…?