Advertisement
పరిశుభ్రత గురించి ఎన్ని కార్యక్రమాలు చేసినా, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించినా సరే జనాలు మాత్రం మన ఇండియాలో పట్టించుకునే అవకాశం ఉండదు. చాలా వరకు కూడా ఇప్పుడు స్వచ్చ భారత్ గురించి మర్చిపోయారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్చ భారత్ గురించి ఏ స్థాయిలో ప్రచారం చేసినా సరే జనాలు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేశారు.
Advertisement
అభివృద్ధి చెందిన దేశాల్లో పరిశుభ్రత ఎక్కువ… అభివృద్ధి చెందే మన లాంటి దేశంలో బద్దకస్తులు ఎక్కువ. మళ్ళీ వాళ్ళను పొగిడి మనల్ని తిట్టినట్టు కాదు. కారులో అరటి పండు తిని తొక్క డివైడర్ మధ్యలోనో లేదంటే రోడ్డు పక్కనో పడేసే బద్ధక రత్నలు రోజు వందల మందిని చూస్తూ ఉంటాం. అయితే జపాన్ లో అటువంటి పరిస్థితి ఉండదు. స్కూల్ డేస్ నుంచే ఎలా ఉండాలో చెప్తారు.
Advertisements
అక్కడ పరిశుభ్రత గురించే ప్రత్యేకంగా సబ్జెక్ట్ లు ఉంటాయి. రోడ్డు మీద ఎలా ప్రవర్తించాలి, ఏంటీ అనే అంశాలను చాలా జాగ్రత్తగా వివరిస్తారు. ఇక ఫైన్ ల గురించి కూడా జపాన్ లో అవగాహన ఎక్కువ. బద్ధకంతో తొక్క పడేస్తే తాట తీస్తారు అన్నట్టు. ఇక ప్రభుత్వం కూడా చెత్త కుండీలను వేల సంఖ్యలో ఏర్పాటు చేస్తూ ఉంటుంది. డస్ట్ క్లీన్ చేసే సిబ్బంది కూడా ఎక్కువగా ఉంటారు. మన ఇండియాలో ప్రభుత్వాలు అలా చేసినా సరే మనకు డస్ట్ బిన్ వరకు వెళ్ళడం కష్టమే.
Advertisements