Advertisement
మన రోజు వారీ జీవితంలో రంగులు కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాయి అనే మాట వాస్తవం. రంగుల విషయంలో చాలా వరకు కూడా మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ప్రమాదానికి ఎరుపు రంగు ఎందుకు…? స్కూల్ బస్సులకు పసుపు రంగు ఎందుకు అనేది చాలా మందికి అర్ధం కాదు. దాదాపు అన్ని దేశాల్లో స్కూల్ బస్సు పసుపు రంగులోనే ఉంటుంది.
Also Read:వాచ్ ఫోటోలో టైం పది గంటల పది నిమిషాల దగ్గర ఎందుకు ఉంటుంది…?
అసలు ఎందుకు అనేది ఒకసారి చూస్తే… సైన్స్ ప్రకారం మన కళ్ళకి మిగతా రంగులతో పోల్చితే పసుపు రంగు చాలా దూరం( 1.24 సార్లు) నుండి అయినా కనపడే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల రక్షణ కోసం ఇతర వాహనాలు దూరం నుండి అయినా సరే గుర్తు పట్టే విధంగా బస్సులకి పసుపు రంగు వేస్తారు అధికారులు. ఈ నియమాన్ని భారత దేశ మోటారు వాహన చట్టం లొ కూడా జత చేయడం జరిగింది.
Advertisement
Advertisements
వర్షం, పొగమంచు అలాగే మంచులో కూడా పసుపు రంగును చూసుకునే అవకాశం ఉంటుంది. పసుపు యొక్క పార్శ్వ పరిధీయ దృష్టి ఎరుపు రంగు కంటే 1.24 రెట్లు ఎక్కువ అని శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఇక చాలా మంది గుర్తించే ఎరుపు రంగు కంటే కూడా పసుపు రంగు ఎక్కువ దూరం కనపడుతుంది. ఒక వ్యక్తి సూటిగా చూడలేకపోయినా సరే తన ముందు ఉన్న పసుపు రంగు స్కూల్ బస్ ను గుర్తించే అవకాశం ఉంది.
Advertisements
Also Read:క్రికెట్ లో రైట్ హ్యాండ్ బ్యాటింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఉండదా…?