Advertisement
మనం కొన్ని కొన్ని విషయాలు తెలియకుండా కొన్ని వస్తువులను వాడేస్తూ ఉంటాం. వాటి గురించి తెలుసుకునే అవసరం లేదు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయం గాని కొన్ని కొన్ని తెలుసుకుంటే మాత్రం ఆసక్తికరంగా ఉంటాయనే మాట వాస్తవం. అలాంటి విషయాల్లో ఒకటి గొడుగు ఎందుకు నల్లగా ఉంటుంది…? అదేంటో ఒకసారి చూద్దాం.
Also Read:క్రికెట్ లో ఎల్బీడబ్ల్యూ నిభందనలు ఏంటీ…?
దాని వెనుక ప్రధాన కారణం ఏంటో తెలుసుకుందాం… నలుపు రంగు గొడుగు 90% వేడిని గ్రహిస్తుంది కాబట్టి ఆ రంగులో ఉంటాయి. తెలుపు రంగు ఉష్ణాన్ని వెనక్కు పంపించే అవకాశం ఉంటుంది. గొడుగులు మొదట్లో వర్షాకాలం కోసం ఉద్దేశించి తయారు చేసారు. నల్ల రంగు వస్త్రంతో చేసిన గొడుగులు ఇతర రంగుల వస్త్రంతో తయారు చేసిన వాటి కంటే వేగంగా ఆరిపోయినట్లు గుర్తించారు.
Advertisement
Advertisements
అందుకే అప్పటి నుండి గొడుగుల తయారీలో నల్ల వస్త్రాన్ని ఎక్కువగా ఉపయోగించడం ఒక ప్రామాణిక పద్ధతిగా మారిందనే చెప్పాలి. గొడుగులు వేసవిలో సూర్యుడి వేడి నుండి రక్షించుకోవడానికి వాడుకోవాలి. వాస్తవానికి, సన్‌స్క్రీన్ లోషన్లు, బట్టలు మరియు టోపీలు సూర్యుడి నుండి మన చర్మం నుండి దూరంగా ఉంచినా, అవి వేడి నుండి మాత్రం దూరంగా ఉంచే అవకాశం లేదు. కాబట్టి అందుకు ఉత్తమ రంగు నలుపు అనే చెప్పాలి. ఇండియన్ మార్కెట్ లో సాధారణంగా గొడుగులు బయట నల్లగానూ మరియు లోపల వెండి రంగు తెలుపుతోనూ పెయింట్ చేసి దొరుకుతాయి.
Advertisements
Also Read:నిద్ర గురించి తెలియని విషయాలు, ఆరోగ్యంగా ఉన్న వారికే అలాంటి ఫీల్ వస్తుందా…?