Advertisement
మన దేశంలో అక్షరాస్యత విషయంలో కేరళ నంబర్ వన్ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోనే కేరళలో అక్షరాస్యత రేటు ఎక్కువ. ఆ రాష్ట్రంలో నూటికి నూరు శాతం మంది అక్షరాస్యులు ఉన్నారు. అక్కడ చదువుకున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్యారంగంలో కేరళ నంబర్ వన్ స్థానంలో ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయితే ఆ రాష్ట్రం ఆ ఘనతను సాధించడానికి అసలు కారణం ఏమిటి ? అంటే…
Advertisement
కేరళలో 1817వ సంవత్సరంలో అప్పటి మహారాణి శ్రీ పద్మనాభసేవిని వంచి ధర్మ వర్ధిని రాజ రాజేశ్వరి మహారాణి ఉథ్రిత్తథి తిరునాల్ గౌరీ పార్వతి బాయి ఓ అధికారిక ప్రకటన చేసింది. అప్పట్లో ట్రావెన్‌కోర్ లో ఆమె కొలువుదీరింది. ఈ క్రమంలో ఆమె అందరికీ విద్య అందాలన్న ఉద్దేశంతో రాజ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం.. కేరళలో విద్యారంగానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆ రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. అలాగే పౌరులకు విద్యను అందించడంలో వెనుకడుగు వేయకూడదు. విద్య వల్ల జనాలకు అనేక అంశాలపై అవగాహన వస్తుంది. వారు ప్రజా సేవకులుగా మారుతారు. రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది.
పై విధంగా ఆ మహారాణి ప్రకటనతోపాటు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి నుంచే ఆ రాష్ట్రంలో విద్యావ్యవస్థ మెరుగ్గా తయారైంది. ప్రతి పాఠశాలలోనూ ప్రభుత్వం జీతం ఇచ్చి ఇద్దరు టీచర్లను నియమించడం మొదలు పెట్టారు. అలా అలా ఆ రాష్ట్రంలో విద్యావ్యవస్థ పనితీరు ఎప్పటికప్పుడు మెరుగవుతూ వచ్చింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 100గా ఉంది. ఆ మహారాణి ముందు చూపు వల్లే కేరళ ఆ ఘనతను సాధించగలిగింది.
Advertisements