Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

పాకిస్థాన్ పోలీస్ స్టేషన్ క‌మాన్ పై భార‌త‌జెండా.! 1965 నాటి ముచ్చ‌ట‌!

Advertisement

భార‌త‌దేశానికి 1947లో స్వాతంత్య్రం వ‌చ్చిన అనంత‌రం భార‌త్‌, పాకిస్థాన్ దేశాలుగా విడిపోయాయి.! కానీ లాహోర్ ఇండియాలో క‌ల‌వాలా? పాక్ లోనా? అనే విష‌యంపై కాస్త సందిగ్థ‌త ఏర్ప‌డింది. ఎందుకంటే లాహోర్ లో 70 శాతం మంది ముస్లింలు, మిగిలిన 30 శాతం హిందువులు, సిక్కులు, క్రిస్టియ‌న్లు ఉండేవారు. మెజారిటీ ముస్లీంలు ఉన్నారు కాబ‌ట్టి ఈ ప్రాంతం పాక్ లోకి వెళ్లిపోయింది! అదే స‌మ‌యంలో ముస్లీం మెజారిటీ అయిన ఫ‌రీదాబాద్ మాత్రం ఇండియాలో క‌లిసిపోయింది!

కాగా 1965లో జ‌రిగిన యుద్ధంలో భార‌త్ పాకిస్థాన్‌పై గెలిచాక భార‌త సైనికులు లాహోర్‌లో భార‌త జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. భార‌త సైనికులు లాహోర్ వ‌ర‌కు చొచ్చుకెవ‌ళ్లి లాహోర్ లోని ఓ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేష‌న్ క‌మాన్ పై జాతీయ ప‌తాకం ఆవిష్క‌రించారు. దాన్ని చిత్రంలో చూడ‌వ‌చ్చు. అయితే లాహోర్ లోని భార‌త సేన‌లు వెన‌క్కి వెళ్లి పోవాల‌ని అప్ప‌ట్లో అమెరికా అప్ప‌టి భార‌త ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిని కోరింది. కానీ శాస్త్రి అందుకు నిరాక‌రించారు.

Advertisement

Advertisements

అయితే శాంతి చ‌ర్చ‌ల పేరిట ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌కు శాస్త్రిని పిల‌వ‌గా వెళ్లారు. ఆ రోజు ఆయన పాకిస్తాన్‌లో యుద్ధం విర‌మిస్తున్నామ‌ని, లాహోర్‌లోని భార‌త సేన‌ల‌ను వెన‌క్కి పిలిపిస్తున్నామ‌ని చెప్పి పాకిస్థాన్‌తో ఒప్పంద ప‌త్రంపై సంత‌కం చేశారు. కానీ అదే రోజు రాత్రి ఆయ‌న అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. ఆయ‌న తిన్న ఆహారంలో విషం క‌లిపి ఆయ‌న్ను చంపారని కొంద‌రు అన్నారు. కానీ కొంద‌రు మాత్రం.. ఆయ‌న‌కు హార్ట్ ఎటాక్ వ‌చ్చింద‌ని చెప్పారు. ఏది ఏమైనా శాస్త్రి మృతి మాత్రం ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే మిగిలిపోయింది.

Advertisements