Advertisement
తమిళనాడులోని మదురైలో ఉన్న మీనాక్షి ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. కొన్ని లక్ష్యల సంఖ్యలో భక్తులు నెల నెలా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఆలయంలో ఉన్న కోనేటిలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఇక ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 4వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. అయితే ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది ? దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మధుర మీనాక్షి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని Maragatha Kal అనే ఆకుపచ్చ రంగు రాయితో నిర్మించారు. అందుకనే అమ్మవారి విగ్రహం ఆకుపచ్చ రంగులో మనకు దర్శనిమస్తుంది. అయితే అది పచ్చ (ఎమరాల్డ్) జాతికి చెందిన రాయి కాదు. కానీ అది అత్యంత అరుదైన జాతికి చెందిన రాయి అని చెబుతారు. ఇక హిందూ సాంప్రదాయంలో బుధుడుకి, ఆకుపచ్చ రంగుకి సంబంధం ఉంటుంది. కనుక ఆ గ్రహ ప్రభావం ఉన్నవారు దాన్ని తొలగించుకునేందుకు ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజలు చేస్తుంటారు.
Advertisement
Advertisements
అయితే అమ్మవారి విగ్రహం ఆకుపచ్చ రంగులో ఉండేందుకు మరొక కారణం కూడా ఉంది. అదేమిటంటే.. ఆకుపచ్చ రంగు అంటే.. జ్ఞానానికి, ప్రతిభకు కొలమానంగా భావిస్తారు. అలాగే అంతులేని ఆహారానికి, ప్రకృతి సంపదకు చిహ్నంగా ఆకుపచ్చ రంగు ఉంటుంది. అమ్మవారు వాటిని అపరిమితంగా ప్రసాదిస్తుందని చెప్పి భక్తులు నమ్ముతారు. ఈ క్రమంలోనే మధుర మీనాక్షి అమ్మవారు ఆకుపచ్చ రంగులో భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా మారింది. అయితే నిజానికి అమ్మవారు మరీ ముదురు ఆకుపచ్చ రంగులో కాకుండా లేత ఆకుపచ్చ రంగులో శరీరాన్ని కలిగి ఉంటుందని చెబుతారు.
Advertisements