Advertisement
మీనా కుమారి నటిగా ఎంతటి గుర్తింపు పొందిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో సుప్రసిద్ధ నటులు నర్గీస్, నిమ్మి, సుచిత్రా సేన్‌లు కూడా ఆమె నటనకు, అందానికి ఫిదా అయ్యారు. అయితే నిజానికి మీనా కుమారి ముస్లిం. ఆమె 1932వ సంవత్సరం ఆగస్టు 1న జన్మించింది. ఆమె అసలు పేరు మెహజబీన్ బేగం. ఆమె తండ్రి అలీ బక్ష్ పార్శీ థియేటర్ ఆర్టిస్ట్. ఆమె తల్లి కూడా నటిగా పేరుగాంచింది. అయితే మీనాకుమారి అప్పట్లో సినిమాల్లో తన ఎడమ చేయిని, ఆ చేతి వేళ్లను తెరపై కనిపించకుండా జాగ్రత్త పడింది. అలా ఆమె ఎందుకు చేసిందంటే..?
Advertisement
1951 మే 21న మీనా కుమారి మహాబలేశ్వర్ నుంచి ముంబైకి తన కారులో భర్త కమల్ అమ్రోహితో కలిసి వస్తోంది. దురదృష్టవశాత్తూ వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అందులో ఆమె చనిపోయి ఉండేది. కానీ లక్ బాగుండడంతో ఆమె ప్రమాదం నుంచి బయట పడింది. ప్రాణాపాయం తప్పింది. కానీ ఆమె ఎడమ చేయికి తీవ్రంగా గాయమైంది. దాని వల్ల ఆ చేయి షేప్ కోల్పోయింది. ఇక అప్పటి నుంచి ఆమె తన ఎడమ చేయి సినిమా తెరపై కనిపించకుండా జాగ్రత్త పడింది. అందుకనే ఆమె నటించిన సినిమాల్లో మనకు ఆమె ఎడమ చేయి కనిపించదు. ఆమె దాన్ని చీర లేదా దుపట్టాతో దాచేసి మనకు కనిపిస్తుంది.
Advertisements
ఇక ఆమెకు బైజు బావ్రా అనే సినిమా వల్ల మీనా కుమారి అనే పేరు వచ్చింది. అయితే మీనా కుమారి సినిమాల్లో నటించినంత కాలం ఆమె లైఫ్ బాగానే ఉండేది. కానీ ఆమె మరణానికి ముందు తీవ్రమైన పేదరికం అనుభవించింది. ఆమె హాస్పిటల్ లో చేరి చికిత్స చేయించుకుంటే అందుకు చెల్లించేందుకు ఆమె వద్ద డబ్బులు లేకపోవడంతో ఆమెకు అభిమాని అయిన ఓ డాక్టర్ ఆమె హాస్పిటల్ బిల్లును చెల్లించాడు. ఆమె చివరి దశలో ఒంటరిగా గడిపింది. ఆమె బ్యూటీ క్వీన్ అయినప్పటికీ ఆమెను ట్రాజెడీ క్వీన్ అని కూడా పిలుస్తారు.
Advertisements