Advertisement
ఆగస్టు 5న ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే ఆలయ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. మరో 3 ఏళ్లలో ఆలయం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే ఆ కార్యక్రమం సందర్భంగా మోదీ ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించారు. ముందుగా జై శ్రీరాం.. జై సియారాం.. అని ఆయన నినాదాలు చేశారు. తరువాతే ప్రసంగం ప్రారంభించారు.
Advertisement
అయితే మోదీ జై శ్రీరాంతోపాటు జై సియారాం.. అని కూడా నినదించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మోదీ ఆ మాటను ఎందుకన్నారు ? జై సియారాం అంటే అర్థమేమిటి ? అని చాలా మంది సందేహిస్తున్నారు. అయితే నిజానికి జై శ్రీరాం.. అన్నా.. జై సియారాం.. అన్నా ఒక్కటే.. రెండింటికీ ఒకటే అర్థం వస్తుంది. అందుకనే మోడీ ఆ పదాన్ని వాడారు. అలాగే మనం సీతారాములు అంటాం కదా. కొందరు భక్తులు సియావర్ రామ్ అని అంటారు. అందులో నుంచి మోదీ కేవలం సియా అనే పదాన్ని తీసుకుని జై సియా రాం అన్నారు. శ్రీరామ్ అంటే ప్రకృతి ( పండిత భాష) ….సియారామ్ అంటే వికృతి ( పామర భాష) అన్నమాట.!
ఇక వ్యాకరణం ప్రకారం జైశ్రీరాం అనే పదం కొంచెం కఠినంగా ఉంటుంది. జై సియారాం అనే పదం మృదువుగా ఉంటుంది. దీన్ని ఎవరైనా సులభంగా నినదించవచ్చు. అందుకనే మోదీ ఆ పదాన్ని వాడారు. ఈ క్రమంలో ఈ పదం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. అయితే భక్తుల ఇష్టం మేరకు జై శ్రీరాం అనవచ్చు. లేదా జై సియారాం అనవచ్చు. ఎలా పిలిచినా దేవుడు ఆలకిస్తాడు.. అవును కదా..!
Advertisements