Advertisement
మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీని పరిపాలించాడన్న సంగతి తెలిసిందే. 1325 నుంచి 1351 వరకు ఢిల్లీ సుల్తాన్‌గా ఉన్నాడు. అయితే చిన్నప్పుడు అతని గురించి మనమందరం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. వాటిల్లో మహమ్మద్ బిన్ తుగ్లక్‌ను పిచ్చి తుగ్లక్‌గా అభివర్ణిస్తూ పాఠాలు ఉండేవి. వాటినే మనం చదువుకున్నాం. అయితే ఇంతకీ అసలు అతన్ని పిచ్చి తుగ్లక్ అని ఎందుకు పిలుస్తారు ?
Advertisement
- తుగ్లక్ తన రాజ్యాన్ని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాలని ఆదేశించాడు. రెండు ప్రాంతాల మధ్య సుమారుగా 600 మైళ్ల దూరం ఉంటుంది. అయితే దేవగిరితో పోల్చితే ఢిల్లీయే రాజధానిగా అన్ని విధాలుగా అర్హత ఉన్న నగరం. కానీ తుగ్గక్ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరి మార్చమన్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న వేలాదిమంది ఉసూరుమంటూ దేవగిరి బాట పట్టారు. అయితే దేవగిరికి జనాలు వెళ్లాక తుగ్లక్ మళ్లీ అందరినీ ఢిల్లీకే వెళ్లాలని ఆదేశించాడు. ఢిల్లీనే రాజధానిగా ఉంటుందని చెప్పాడు. దీంతో జనాలు మళ్లీ ఇబ్బందులు పడక తప్పలేదు.
- రాజధానిని మార్చే విషయంలో రెండు సార్లు అటు ఇటు తిరిగేసరికి జనాలు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అసలే ఆ మార్గం మొత్తం రాళ్లు రప్పలతో నిండి ఉంటుంది. దీనికి తోడు అప్పటికే అనారోగ్యం పాలై మంచాలకే పరిమితం అయిన వారు, నడవలేని వారు ఇబ్బందులు పడ్డారు. . ఇక ఆ రెండు నగరాల మధ్య ప్రయాణించే సమయంలో అనేక మంది మహిళలు, చిన్నారులు చనిపోయారు. అయినప్పటికీ తుగ్లక్ తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. అటు, ఇటు రాజధానిని ఇష్టం వచ్చినట్లు మార్చాడు.
- చిన్న చిన్న తప్పులకు కూడా కఠిన శిక్షలు విధించేవాడు!
అతని ముందుచూపు అతడికి పిచ్చితుగ్లక్ అనే పేరును తీసుకొచ్చింది
Advertisements