Advertisement
దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలయాల్లో కాశీ విశ్వేశ్వరాలయం కూడా ఒకటి. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ శివాలయం ఉన్నా సరే అందులో శివ లింగానికి ఎదురుగా నంది విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. అవును.. అయితే కాశీ విశ్వేశ్వరాలయంలో మాత్రం శివలింగానికి ఎదురుగా నంది ఉండదు. అవును.. ఇది కూడా నిజమే. అయితే ఆ ఒక్క ఆలయంలో మాత్రం నందిని ఎందుకు ప్రతిష్టించలేదు ? అందుకు ఏమైనా కారణాలు ఉన్నాయా ? అంటే…
ఒకప్పుడు.. అంటే.. ఔరంగజేబు భారతదేశంపై దండెత్తినప్పుడు దేశంలోని ఆలయాలన్నింటినీ ధ్వంసం చేయడమే అతను పనిగా పెట్టుకున్నాడు. అందులో భాగంగానే అతని సైన్యం కాశీ విశ్వేశ్వర ఆలయం వద్దకు వచ్చి ఆలయ నిర్మాణాన్ని ధ్వంసం చేయడం మొదలు పెట్టింది. అయితే ఆలయంలో గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని అప్పటి ప్రధాన అర్చకుడు తీసి దాన్ని సమీపంలో ఉన్న ఓబావిలో వేశాడు. ఈ క్రమంలో ప్రధాన ఆలయాన్ని దాదాపుగా ధ్వంసం చేశారు. కానీ కొద్ది భాగం శిథిలాలు మిగిలాయి. తరువాత దానిపైనే ఇప్పటి జ్ఞాన్‌వాపి మసీదును నిర్మించారు.
Advertisement
అయితే ఒకప్పుడు ఆలయం ఉన్న ప్రాంతంలోనే శివలింగానికి ఎదురుగా నంది ఉండేది. ఆలయాన్ని ధ్వంసం చేశారు. కానీ నందిని ధ్వంసం చేయలేదు. దీంతో ఆ నంది పాత ఆలయం ఉన్న ప్రాంతంలో ఇప్పటికీ ఉంది. తరువాత ఆ బావి నుంచి శివలింగాన్ని తీసేందుకు యత్నించారు. కానీ అందులో ఎంత వెదికినా లింగం లభించలేదు. ఈ క్రమంలో ఆ లింగాన్ని పోలిన నమూనాతో పక్కనే ఓ ఆలయాన్ని నిర్మించారు. కానీ అందులో ఉన్న లింగానికి ఎదురుగా మాత్రం నందిని ఏర్పాటు చేయలేదు. కాకపోతే పాత ఆలయం ఉన్న ప్రాంతంలో నందిని దర్శించుకోవచ్చు.
Advertisements
Advertisements
కాగా ఇప్పటి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని 1780లో అప్పటి మరాఠా రాజు అహిల్యా బాయ్ హోల్కర్ నిర్మించాడు. తరువాత ఆలయానికి మొదటి సిక్కు మహారాజు రంజిత్ సింగ్ 1 టన్ను బంగారాన్ని దానం చేశాడు. తరువాత 1983 నుంచి ఆలయాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది.
ఇక కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉన్న బావి కూడా ఇప్పటికీ అలాగే ఉంది. దాన్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. అందులోని నీటిని తీర్థంగా భక్తులు స్వీకరిస్తారు. దాన్ని తీసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతారు. అయితే ఆ బావి లోతు ఎంత ఉంటుందో ఇప్పటికీ అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే అది అనంతమైన లోతును కలిగి ఉంటుందట. దానికి అడుగు భాగం అంటూ లేదని, అందుకనే శివలింగం కనిపించడం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఆ లింగం మాత్రం ఆ బావిలోనే ఉందని ఇప్పటికీ నమ్ముతారు. కాశీ విశ్వేశ్వరాలయాన్ని సందర్శించుకున్నప్పుడు ఆ నందిని, ఆ బావిని కూడా దర్శించుకోవడం మరిచిపోకండి.