Advertisement
నేను ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు జరిగిందీ సంఘటన. అప్పుడు నాగాలాండ్‌లోని వోఖాలో విధులు నిర్వర్తిస్తున్నా. ఎయిర్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ టీంలో పనిచేస్తున్నా. అప్పుడు ఓ సైనికుడు తన షూస్‌ను పాలిష్ చేసుకుంటుండగా చూసి.. ఈ రోజు షూస్‌ను ఇంతలా ఎందుకు పాలిష్ చేస్తున్నావు ? అని అతన్ని ప్రశ్నించడంతో అతను బదులిస్తూ.. ఈ రోజు కమాండింగ్ ఆఫీసర్‌తో ఓ మీటింగ్ ఉంది.. అందుకనే షూస్‌ను పాలిష్ చేసుకుంటున్నా.. అని చెప్పాడు.
అయితే తరువాత అతని గురించి తెలిసిందేమిటంటే.. అతని కుమారుడికి అనారోగ్యంగా ఉందని, వెంటనే రావాలని.. అతనికి ఇంటి నుంచి టెలిగ్రాం వచ్చింది.. కానీ అతను ఇంకా వెళ్లలేదు. అదే విషయమై మళ్లీ అతన్ని ప్రశ్నించా.. అందుకు అతను మాట్లాడుతూ.. యూనిట్‌లో సైనికుల సంఖ్య బ్యాలెన్స్‌గా లేదు, బ్యాలెన్స్ అయినప్పుడు వెళ్తా.. అని అన్నాడు. అంటే.. సైనికులు కొందరు లీవ్‌లో ఉండడంతో యూనిట్‌లో ఉన్న సైనికుల సంఖ్య తక్కువగా ఉందని, లీవ్‌లో ఉన్న వారు వస్తే అప్పుడు సంఖ్య పెరుగుతుంది కదా.. తరువాత అతను లీవ్ మీద వెళ్లవచ్చని.. అర్థం అన్నమాట.
Advertisement
అంటే.. సైనికులకు కుటుంబం కన్నా దేశ భద్రతే ముఖ్యం అని అర్థమవుతుంది. అందువల్లే అనేక మంది సైనికులు తమ కుటుంబాలను కూడా వదిలిపెట్టి ఎక్కడో దూరంగా దేశ సరిహద్దుల వద్ద రోజుకు 24 గంటలూ దేశానికి కాపలా కాస్తుంటారు. అలా కొన్ని లక్షల మంది సైనికులు జీవితం గడుపుతుంటారు. ప్రతి సైనికుడికీ కుటుంబం కన్నా ముందు దేశ భద్రతమే ముఖ్యం.
Advertisements
ముందస్తు రిటైర్మెంట్లు:
Advertisements
కానీ ఆర్మీలో చేరాక చాలా మంది కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి రిటైర్మెంట్ ఏజ్ రాకున్నా ముందుగానే రిటైర్మెంట్ తీసుకుంటుంటారు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు పనిచేశాక ప్రమోషన్లు వచ్చి బాధ్యతలు కూడా పెరుగుతాయి. కుటుంబానికి ఇంకా దూరమవుతారు. అందుకనే కొందరు ఆర్మీలో చేరాక 17, 20, 25, 30 ఏళ్ల పాటు పనిచేసి ముందుగానే రిటైర్మెంట్ తీసుకుంటుంటారు. నా వరకు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 20 ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యా. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా కొన్ని సంవత్సరాల పాటు ఆర్మీలో పనిచేసి ముందుగానే రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. కానీ.. ఎంతైనా కుటుంబం కన్నా.. దేశ భద్రతే ముఖ్యం కదా..!