Advertisement
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభం అయినప్పుడు నిజానికి ఇంత సక్సెస్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఐపీఎల్ అనేక దేశాల క్రికెట్ జట్లకు మేటి ప్లేయర్లను అందించింది. దీంతో ప్రపంచంలోని అన్ని క్రికెట్ లీగ్‌ల కన్నా ఐపీఎల్ ఎంతగానో పేరు గాంచింది. అయితే ఐపీఎల్ ను చూసి అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను నిర్వహిస్తోంది. కానీ దానికి పెద్దగా ఆదరణ లభించడం లేదు. అలాగే ఐపీఎల్ లాంటి ప్రమాణాలను పీఎస్ఎల్ అందుకోలేకపోతోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేమిటంటే…
1. డబ్బు:
ప్రపంచంలోనే బీసీసీఐ అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ఆ విషయం అందరికీ తెలుసు. ఐపీఎల్ అంతటి సక్సెస్ అయ్యేందుకు బీసీసీఐ భారీ ఎత్తున ప్రైజ్ మనీ ఇస్తుండడం ఒక కారణం. అలాగే వేలంలో ఫ్రాంచైజీలు భారీ ఎత్తున డబ్బు వెచ్చించి ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో అటు ఫ్రాంచైజీలకు, ఇటు ప్లేయర్లకు లాభం కలుగుతోంది. ఐపీఎల్ సక్సెస్‌కు ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కానీ పీఎస్ఎల్ ఈ విషయంలో వెనుక బడింది. అందులో తక్కువ మొత్తంలో ప్రైజ్ మనీ, మ్యాచ్ ఫీజు లభిస్తాయి. కనుకనే ప్లేయర్లు పీఎస్ఎల్ కన్నా ఐపీఎల్ అంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
Advertisements
2. స్టేడియంలు:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కరోనా కారణంగా ఈ సారి దుబాయ్‌లో జరిగింది. కానీ ప్రతి ఏటా ఇండియాలోనే జరుగుతుంది. ఇక భారత్‌లోని క్రికెట్ స్టేడియాలతో పోలిస్తే పాక్ స్టేడియాలు, వాటిల్లో లభించే సౌకర్యాలు అంత నాణ్యంగా ఉండవు. మన దేశంలో ఐపీఎల్ నిర్వహిస్తే స్టేడియాలు నిండుతాయి. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. పీఎస్ఎల్‌కు ఆదరణ లభించడం లేదని చెప్పేందుకు ఇది కూడా ఒక కారణమే.
Advertisement
Advertisements
3. ఇంటర్నేషనల్ షెడ్యూల్:
ఐపీఎల్ మొదట్లో ఇతర దేశాల ప్లేయర్లు లీగ్‌లో ఆడేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. వారు తమ సొంత దేశాలకే మొదటి ప్రాధాన్యతను ఇచ్చేవారు. అయితే రాను రాను ఇతర దేశాలతోపాటు అటు ఐసీసీ కూడా ఐపీఎల్ నిర్వహణ సమయంలో మ్యాచ్‌లను నిర్వహించడం లేదు. దీంతో ఐపీఎల్ టోర్నీలకు ఇతర దేశాల ప్లేయర్లందరూ అందుబాటులో ఉంటున్నారు. ఫలితంగా లీగ్‌లో అందరూ ఆడుతున్నారు. ఆదరణ పెరుగుతోంది. కానీ పీఎస్ఎల్‌కు ఆ అవకాశం లేదు. దీంతో పీఎస్ఎల్ కు క్రమంగా ఆదరణ తగ్గుతోంది.
4. బెస్ట్ కోచ్ లు:
డబ్బులు ఎక్కువగా అందుబాటులో ఉండడంతో ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలు ప్రపంచంలోని అత్యుత్తమ మాజీ ఆటగాళ్లను, కోచ్‌లను ప్రత్యేకంగా నియమించుకుంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో లేని విధంగా హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, అసిస్టెంట్ కోచ్, మెంటార్.. ఇలా చాలా మందిని శిక్షకులుగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో ప్లేయర్లకు సహజంగానే ఏదైనా ఒక టీం తరఫున ఆడాలని, అత్యుత్తమ కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుని స్కిల్స్ ను మరింత మెరుగు పరుచుకోవాలని చూస్తున్నారు. ఫలితంగా ఐపీఎల్‌కు ఆదరణ పెరుగుతోంది. కానీ పీఎస్ఎల్ ఈ విషయంలోనూ వెనుకబడే ఉంది.
5. స్కౌటింగ్ ప్రక్రియ:
ఐపీఎల్ 2 నెలల పాటు జరుగుతుంది. అంతకు నెల లేదా 2 నెలల ముందుగా ప్లేయర్లకు వేలం వేస్తారు. కానీ స్కౌట్స్ మాత్రం ఏడాదంతా పనిచేస్తారు. తమ టీంలకు ఏ ప్లేయర్లు అయితే బాగుంటుంది, ఎవరిని తీసుకోవాలని వారు నిరంతరం ఆరా తీస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడే ప్లేయర్ల వివరాలను సేకరిస్తారు. వారి ప్రదర్శనలను బట్టి వేలంలో వారిని సొంతం చేసుకుంటారు. దీని వల్ల ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఉత్తమ ప్లేయర్లను తమ జట్లలోకి తీసుకోగలుగుతున్నాయి. అయితే పీఎస్ఎల్ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం లేదు. ఆ లీగ్‌కు ఆదరణ తగ్గడానికి ఇది కూడా ఒక కారణమే.