Advertisement
ఆస్ట్రేలియాతో ఇటీవలే జరిగిన బార్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భారత్ విజయ దుందుభి మోగించింది. భారత్ ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో గెలిచి చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే భారత జట్టుకు ఇన్ చార్జి కెప్టెన్‌గా ఉన్న అజింక్యా రహానెకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
అడిలైడ్ టెస్టులో భారత్ దారుణ ఓటమి అనంతరం మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్‌లలో మ్యాచ్‌లను ఆడింది. మెల్‌బోర్న్ మ్యాచ్‌లో గెలవగా, సిడ్నీ మ్యాచ్ డ్రా అయింది. బ్రిస్బేన్ మ్యాచ్‌లో గెలిచింది. దీంతో రహానె కెప్టెన్సీపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక రహానే ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు తిరిగి రాగానే అతని కుటుంబ సభ్యులు అతనికి గ్రాండ్ వెల్కమ్ పలికారు.
Advertisement
రహానేకు అతని కుటుంబ సభ్యులు వెల్కమ్ చెబుతూనే ఓ కేక్‌ను కట్ చేసే కార్యక్రమం నిర్వహించారు. అయితే ఆ కేకుపై కంగారు జంతువు బొమ్మ ఉంది. దీంతో రహానే ఆ కేక్‌ను కట్ చేయలేదు. అతను అలా ఎందుకు చేశాడంటే.. కంగారు అనేది ఆస్ట్రేలియా దేశ జాతీయ జంతువు. మన దేశ జాతీయ జంతువు లేదా పక్షి లాంటి వాటిని ఎవరైనా హింసిస్తే మనకు కోపం వస్తుంది కదా. ఆ పని చేసే వారిని జైల్లో కూడా పెడతారు. పైగా క్రికెట్ అనేది మ్యాచ్ ల వరకే. బయటకు వస్తే అందరూ సోదర భావంతో మెలగాలి. అంతేకానీ గెలుపు, ఓటములను పర్సనల్ గా తీసుకోకూడదు. అందుకనే రహానే కంగారు బొమ్మ ఉన్న కేక్‌ను కట్ చేయలేదు.
రహానే అలా చేయడం పట్ల అందరూ అతన్ని మెచ్చుకుంటున్నారు. రహానే ఇతర దేశాలకు, వారి ఆచార వ్యవహారాలకు కూడా విలువ ఇస్తాడని అతన్ని అభినందిస్తున్నారు. క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అని, రహానే రియల్ జెంటిల్మన్ అనిపించుకున్నాడని అందరూ అతన్ని పొగుడుతున్నారు.
Advertisements
Advertisements