Advertisement
సాధారణంగా నిత్యం మనం స్కూళ్లు, కాలేజీలకు చెందిన బస్సులను చూస్తుంటాం. అవి పసుపు రంగులో ఉంటాయి. అలాగే రైల్వే స్టేషన్లలో వాటి పేర్లకు సంబంధించి బోర్డులు కూడా పసుపు రంగులోనే ఉంటాయి. వాటిపై అక్షరాలను నలుపు రంగులో రాస్తారు. అయితే అలా స్టేషన్లలో వాటి బోర్డులను ఆ రంగులోనే ఎందుకు రాస్తారో తెలుసా..? రంగులన్నింటిలోనూ ఎరుపు రంగు తరంగ దైర్ఘ్యం (వేవ్ లెంగ్త్) ఎక్కువగా ఉంటుందని చెప్పి దాన్ని డేంజర్ కలర్‌గా వాడుతారు. మరి అదే ఎరుపు రంగును కాకుండా పసుపు రంగును పైన తెలిపిన వాటికి ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..? అందుకు సరైన కారణం కూడా ఉంది. అదేమిటంటే…
పాఠశాలలో సైన్సు పాఠాల్లో VIBGYOR అనే వర్ణపటం గురించి అందరూ చదివే ఉంటారు. అందులో V అంటే వయొలెట్ నుంచి మొదలు పెడితే R అంటే.. రెడ్ వరకు వేవ్ లెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. అంటే చాలా దూరంలో ఉన్నప్పటికీ రెడ్ కలర్‌లో ఉన్న వస్తువులను మనం చాలా సులభంగా గుర్తిస్తామన్నమాట. అందుకనే డేంజర్‌ను సూచించే వాటికి ఎరుపు రంగును ఉపయోగిస్తారు. అయితే రైల్వే స్టేషన్ల పేర్ల బోర్డులకు కూడా ఎరుపు రంగు వాడవచ్చు కదా.. కానీ పసుపు రంగునే వాడుతారు. ఎందుకంటే… పైన తెలిపిన VIBGYOR లో ఎరుపు తరువాత దానికి ముందున్న O అంటే.. ఆరెంజ్ కాకుండా.. Y అంటే.. యెల్లో కలర్ నిజానికి రాత్రి పూట చాలా బాగా కనిపిస్తుంది. దానిపై పగలు లేదా రాత్రి ఏ సమయంలో అయినా సరే కాంతి పడినప్పుడు ఎక్కువగా రిఫ్లెక్షన్ వస్తుంది. దీంతో జనాల దృష్టి ఎక్కువగా పసుపు రంగు మీదే పడుతుంది. ఈ క్రమంలోనే ఆ రంగు జనాలను ఆకర్షిస్తుంది. అందుకనే ఆ రంగులో రైల్వే స్టేషన్ల పేర్ల బోర్డులను రాస్తారు.
Advertisement
ఇక యెల్లో కలర్‌పై ఇతర ఏ రంగుతో అక్షరాలను రాసినా.. కాంతి పడితే అవి సరిగ్గా కనిపించవు. ఒక్క బ్లాక్ కలర్‌లో అక్షరాలు రాస్తేనే అవి స్పష్టంగా కనిపిస్తాయి. అందుకనే యెల్లో బోర్డులపై అక్షరాలను రాసేందుకు బ్లాక్ కలర్‌ను వాడుతారు. ఇక రాత్రి పూట లేదా పగలు ఏ సమయంలో అయినా సరే లోకో పైలట్లు ట్రెయిన్‌ను నడిపే సమయంలో స్టేషన్ల పేర్ల బోర్డులను సులభంగా గుర్తించేందుకు వీలుగా వాటిని యెల్లో కలర్‌లో ఏర్పాటు చేస్తారు. వారు ఈ కలర్ బోర్డులనే సులభంగా గుర్తించగలుగుతారు. వాటిపై వారి ఫోకస్ ఒక్కసారిగా పడుతుంది. దీంతో తాము ఏ స్టేషన్‌లో ఉన్నాం, దేన్ని దాటుతున్నాం అని స్పష్టమైన అవగాహన వస్తుంది. ఏంటీ. ఇంకా నమ్మకం కలగడం లేదా.. అయితే ఒక్కసారి కింది చిత్రాన్ని చూడండి.. అందులో మీ చూపు దేనిపై ఎక్కువగా పడుతుంతో పరిశీలించండి.
Advertisements
Advertisements
పైన చిత్రంలో మీ చూపు ముందుగా యెల్లో కలర్‌లో ఉన్న బస్సుపై పడింది కదా.. అవును.. అదే.. అందుకనే అదే రంగులో ఆ వాహనాలే కాదు.. రైల్వే స్టేషన్ల పేర్ల బోర్డులను కూడా ఏర్పాటు చేస్తారు. ఇతర ఏ రంగులో ఉన్న వస్తువు లేదా వాహనంపైనైనా అంత త్వరగా దృష్టి పడదు. కనుకనే యెల్లో కలర్‌నే ఇందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అదీ.. దీని వెనుక ఉన్న అసలు కారణం..!