Advertisement
దేశం కోసం పోరాడి చనిపోయిన అమరవీరుల అంత్యక్రియలను ఆర్మీ అధికారులు ఓ ప్రోటోకాల్ ప్రకారం నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఇలా గాల్లోకి కాల్పులు జరుపుతారు.
7 గ్రూపులుగా..గ్రూపుకు ముగ్గురు చొప్పున మొత్తం 21 మంది సైనికులు నిలబడి…అమరవీరుడి గౌరవార్థం గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరుపుతారు. దీని అర్థం….మరణాన్ని ధృవీకరించడం.. సర్వీస్ లో ఉన్నప్పుడు అతడిని జాగ్రత్తగా చూసుకున్నామని తెలపడం. వాస్తవానికి యుద్దవిరమణ సందర్భంలో ఇరు దేశాల సైనికులు ఇలా చేసేవారు. అదే సాంప్రదాయంగా కంటిన్యూ అవుతూ వస్తోంది.!
అంత్యక్రియలకు ఆర్మీ ఫాలో అయ్యే ప్రోటోకాల్ విధానం.
అమరుడయ్యాక …హాస్పిటల్ ఫార్మాలిటీ పూర్తయ్యాక…జాతీయ జెండాను అతడి పార్థివ దేహంపై కప్పుతారు.
Advertisements
స్వస్థలానికి తరలించే బాధ్యతను పూర్తిగా చూసుకుంటారు.
Advertisement
ఆరుగురు సైనికులు అతని శవపేటికను మోస్తారు.
21 మంది సైనికులు … గాల్లోకి 3 రౌండ్ల కాల్పుల తర్వాత… అతని పార్థివ దేహంపై కప్పిన జెండాను …. సుపీరియర్ ఆఫీసర్ తొలగిస్తారు.
సాంప్రదాయం ప్రకారం అంతిమ దహన సంస్కారాలు అయ్యాక…. సదరు అమరవీరుడి బట్టలతో సహా టోపిని జాతీయ జెండాను వారి కుటుంబ సభ్యులకు ఇస్తూ… గౌరవ వందనం చేస్తారు.
Advertisements