Advertisement
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 7 వింతల్లో తాజ్ మహల్ ఒకటి. దీన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది టూరిస్టులు నిత్యం వస్తుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి తాజ్ మహల్ చెక్కు చెదరని కట్టడంగా ఉంది. ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపును కూడా పొందింది. అయితే తాజ్ మహల్ వద్ద రాత్రి పూట లైట్లను మాత్రం ఆన్ చేయడం లేదు. దీని వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే…
రాత్రి పూట తాజ్ మహల్ వద్ద లైట్లను ఆన్ చేయడం లేదు. ఎందుకంటే.. లైట్లను ఆన్ చేస్తే అనేక పురుగులు వస్తాయి. దీంతో అవి విసర్జించే ద్రవాలు, ఘనాలతో తాజ్ మహల్ అంద విహీనంగా మారుతుంది. దాని గోడలు పాడవుతాయి. అందుకనే లైట్లను రాత్రి పూట అక్కడ ఆన్ చేయడం లేదు. అలాగే రాత్రి పూట లైట్లను ఆన్ చేసి ఉంచడం వల్ల టూరిస్టులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రాత్రి పూట అంత మంది టూరిస్టులను అక్కడికి అనుమతించడం సరికాదు. అందుకనే లైట్లను ఆన్ చేయడం లేదు.
Advertisement
ఇక తాజ్ మహల్‌ను మార్బుల్‌తో కట్టారు కనుక ఇప్పటికే అది అక్కడి పర్యావరణ కాలుష్యం కారణంగా గ్రీన్ కలర్‌లోకి మారుతోంది. తాజ్ మహల్ ఉపరితలం కాలుష్యం బారిన పడి ధ్వంసమవుతోంది. దాన్ని పరిరక్షించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితిలో రాత్రి పూట లైట్లు ఆన్ చేస్తే తాజ్ మహల్ మరింత పాడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకనే అక్కడ రాత్రి పూట లైట్లను వెలిగించడం లేదు.
కానీ రాత్రి పూట తాజ్ మహల్ వద్ద లైటింగ్ అవసరం లేదు. ఎందుకంటే దానిపై పౌర్ణమి రోజుల్లో చక్కని వెలుతురు పడుతుంది. ఆ వెలుతురులో తాజ్ మహల్ వైవిధ్య భరితంగా కనిపిస్తుంది. కనుక రాత్రి పూట తాజ్ మహల్‌కు లైటింగ్ అవసరం లేదు. అందుకనే లైట్లను వెలిగించడం లేదు.
Advertisements
Advertisements