Advertisement
భూమిలో అనేక పొరలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. నీటి కోసమైతే కొన్ని వందల నుంచి వేల అడుగుల వరకు బోరు తవ్వుతారు. అదే చమురు అయితే ఇంకా ఎక్కువ లోతుకు తవ్వుతారు. కానీ ఎవరైనా సరే.. కొంత నిర్దిష్టమైన లోతుకు మాత్రమే భూమి లోపలికి తవ్వకాలు జరుపుతారు. కానీ 40వేల అడుగుల కన్నా లోతుకు అసలు ఎవరూ భూమి లోపలికి తవ్వలేరు. అవును.. ఇది నిజమే.. ఎందుకంటే…
చిత్రంలో ఇచ్చిన బోర్ చూశారు కదా.. దాన్ని 1989లో తవ్వడం ఆపేశారు. అది కోలా సూపర్‌డీప్ బోర్ హోల్. అంతకు 2 దశాబ్దాల ముందు నుంచే ఆ బోర్‌ను తవ్వడం మొదలు పెట్టారు. అలా దాదాపుగా 20 ఏళ్ల పాటు దాన్ని తవ్వారు. మొత్తం 12,226 మీటర్లు.. అంటే.. సుమారుగా 40,111 అడుగుల లోతుకు వారు డ్రిల్ వేశారు. నిజానికి వారు 15వేల మీటర్లు.. అంటే 49వేల అడుగుల లోతుకు తవ్వాల్సి ఉంది. కానీ 40,111 అడుగుల లోతు వద్దే ఆగిపోయారు.
Advertisement
భూమిలో 40వేల అడుగుల లోతు వద్ద ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. అక్కడ బోర్‌కు సంబంధించిన పరికరాలు పగిలిపోయేవి. దీంతో ఆ తరువాత లోతుకు తవ్వడాన్ని రష్యా ప్రభుత్వం ఆపేసింది. అయితే వారు ఆ డ్రిల్‌ను ఎందుకు వేశారో ఇప్పటికీ తెలియదు. కానీ 20 సంవత్సరాల పాటు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి వారు బోర్ తవ్వారు. అందుకు ఎంతో సమయంతోపాటు డబ్బు, శ్రమ వృథా అయ్యాయి. అంత చేసినా వారు ఏం ఆశించి ఆ బోర్‌ను తవ్వారో వారికే తెలియదు. అయితే భూమి లోపలికి 40వేల అడుగుల కన్నా లోతుకు మాత్రం ఇంకా తవ్వలేమనే ఒక్క విషయం మాత్రం అర్థమైంది. మరి సమయాన్ని, డబ్బును, శ్రమను భారీగా ఖర్చు పెట్టి.. మళ్లీ ఆ రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారో, లేదో చూడాలి.
Advertisements