Advertisement
దాదాపుగా మన దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఉన్న ఏ ఆలయంలో అయినా సరే.. ఎక్కడికి వెళ్లినా సరే.. దైవ పూజ సందర్భంగా పండితులు కేవలం సంస్కృతంలోనే మంత్రాలు చదువుతారు. ఇతర భాషల్లో మంత్రాలు చదవరు. సంస్కృతం దైవ భాష అని అందుకనే ఆ భాషలో వారు మంత్రాలు చదువుతారు. అయితే తమిళనాడులో మాత్రం కొన్ని ఆలయాల్లో మంత్రాలు తమిళంలో చదువుతారు. కానీ కొన్నింటిలో సంస్కృతంలో మంత్రాలు చదువుతారు. ఇలా ఎందుకు జరుగుతుంది ? అంటే…
తమిళనాడులో రెండు రకాలకు చెందిన అయ్యంగార్లు ఉన్నారు. ఒకరిని వేదకలై అయ్యంగార్లు అంటారు. ఇంకొకరిని థెంకలై అయ్యంగార్లు అని పిలుస్తారు. అయితే వేదకలై అయ్యంగార్లు సంస్కృతంలో మంత్రాలు చదువుతారు. థెంకలై అయ్యంగార్లు తమిళంలో మంత్రాలు చదువుతారు. ఈ క్రమంలో తమిళనాడులో వీరి సంఖ్య ఎక్కడ ఎక్కువగా అంటే.. అక్కడ వారు ఆ భాషలో మంత్రాలు చదువుతారు.
Advertisement
ఉదాహరణకు.. శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో తమిళంలో మంత్రాలు చదువుతారు. అంటే అక్కడ థెంకలై అయ్యంగార్లు ఎక్కువగా ఉంటారన్నమాట. ఇక కంచీపురం వరదరాజ స్వామి ఆలయంలో సంస్కృతంలో మంత్రాలు చదువుతారు. అంటే అక్కడ వేదకలై అయ్యంగార్లు ఎక్కువగా ఉంటారన్నమాట. అందుకనే తమిళనాడులో మనకు ఆలయాల్లో కొన్ని చోట్ల తమిళంలో, కొన్ని చోట్ల సంస్కృతంలో మంత్రాలు వినిపిస్తాయి. ఇక ఆయా అయ్యంగార్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో శుభ కార్యాలప్పుడు వారు తమకు అనుకూలమైన భాషలోనే మంత్రాలు చదువుతారు. అయితే.. నిజానికి దేవుడి ఎదుట అన్ని భాషలూ సమానమే. ఏ భాషలో పిలిచినా దేవుడు పలుకుతాడు. భక్తుల మొర ఆలకిస్తాడు. దేవుడికి ఆ భాష, ఈ భాష అనే తేడా ఉండదు. అందరూ సమానమే.
Advertisements