Advertisement
ఎవరు ఎన్ని చెప్పినా సరే ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు ఒక సంచలనం. ఎవరికి సాధ్యం కాని ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నారు. అమితాబ్ లాంటి హీరోకి కూడా ఆయన మరిచిపోలేని విజయాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే ఫాన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అసలు ఎందుకు ఆయన అలా అయిపోయారు అనేది చూస్తే…
Also Read:గ్యాస్ పైప్ లైన్ లీక్ అయితే రాబందులకు ఎలా తెలుస్తుంది…?
నేను ఒకటి అనుకుంటే అదే నిజం అనే శైలి వర్మది. ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ సినిమాలు, కథ భిన్నంగా ఉండాలి. సినిమా స్టార్ హీరోలతో ఉండాలి, సినిమాలో స్టార్ హీరోయిన్ లు ఉండాలి. ఇక సినిమా టేకింగ్ విషయంలో గాని, కథ విషయంలో గాని యువతను ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఇవేమీ వర్మ సినిమాల్లో ఇప్పుడు లేవనే చెప్పాలి. ఆయన స్టార్ హీరోలతో సినిమా చేసే ఆలోచననే చంపుకున్నారు.
Advertisement
Advertisements
ఆయన మాటలకు ఉండే పదును సినిమా కథలకు లేకుండా పోయింది. వర్మ సమకాలీన పరిస్థితులకి కథలు తయారు చేయలేకపోతున్నారు అనే భావన ఉంది. ఆయన కావాలని చేయడం లేదా లేక ఆయనలో ఆ సామర్ధ్యం తగ్గిందా అనేది తెలియదు. తనకు బాగా తెలిసిన ఫార్మాట్ లో సినిమాలు తీయడం, రాజకీయ నాయకులు, కొందరు వ్యక్తులను హైలెట్ చేయడం వంటివి చేయడం వర్మను బాగా ఇబ్బంది పెట్టె విషయం. ఆయనకు నచ్చే చేస్తున్నారు అనుకోండి. వర్మ సినిమాను థియేటర్ లో ఎక్కువ సమయం కూర్చుని చూడలేని పరిస్థితి ఉంటుంది.
Advertisements
Also Read:ఆ కాంగ్రెస్ ఎంపీ ఇంత టాలెంట్ ఉన్న నాయకుడా…? ఆయన ఏం చదివారు…?