Advertisement
కాలుతున్న భార్య చితిపై అమాంతం దూకేశాడు భర్త….అక్కడే ఉన్న బంధువులు అడ్డుకోవడంతో… స్మశానానికి దగ్గర్లో ఉన్న బావిలో దూకి చనిపోయాడు.
అసలేం జరిగింది? మహారాష్ట్ర లోని భంగారామ్ తట్టోథి అనే గ్రామంలో నివసించే కిషోర్ కు రుచితతో 4 నెలల క్రితం పెళ్లైంది.! కిషోర్ తన సొంత జిల్లా అయిన చంద్రాపూర్ RTO ఆఫీస్ లో పనిచేస్తాడు. భార్యభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. భార్య అంటే కిషోర్ కు అమితమైన ప్రేమ.! రుచిత 3 నెలల గర్భావతి కూడా.!
Advertisement
లాక్ డౌన్ లో తల్లిగారింటికి వెళ్లి 4 రోజుల క్రితమే కిషోర్ దగ్గరికి వచ్చింది రుచిత. ఉదయం బహిర్భూమికి పోలాల్లోకి వెళ్లిన రుచిత మద్యాహ్నం వరకు తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులువెతకగా… ఓ బావి వద్ద ఆమె చెప్పులు కనిపించాయి. పోలీసులకు సమాచారమివ్వడంతో… గ్రామస్తుల సహాయంతో రుచిత డెడ్ బాడీని బయటకు తీశారు పోలీసులు .
Advertisements
Advertisements
శవాన్ని స్మశానికి తీసుకెళ్లి..చితికి నిప్పు అంటిచాక…భార్య మరణాన్ని తట్టుకోలేని కిషోర్ అమాంతం ఆ చితిలోకి దూకేశాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు బందువులు అతడిని చితి మీది నుండి పక్కకు లాగారు. అదే బాధతో స్మశానం దగ్గర్లోని ఉన్న బావిలో దూకి చనిపోయాడు.!
ఈ రెండు మరణాలు 3 సందేహాలను మిగిల్చిపోయాయి….పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.