Advertisement
కర్నాటక లోని కొప్పాల్ కు చెందిన శ్రీనివాస్ గుప్తా ..ఓ వ్యాపారవేత్త & రాజకీయ నాయకుడు. గుప్త దిగువ మద్య తరగతికి చెందిన వాడు ….వెంకట నాగ మాధవిని వివాహం చేసుకున్న తర్వాత అతని తలరాత మారింది. పట్టిందల్లా బంగారమైంది. భార్య సలహాలను పాటిస్తూ ఒక్కో మొట్టు ఎదిగాడు. మొదట హెయిర్ ప్రాసెసింగ్ బిజినెస్ చేసే గుప్తా…తర్వాత దేశంలోని ప్రముఖ దేవస్థానాల వద్ద సమర్పించిన తలనీలాలను కొనుగోలు చేసి వాటిని ప్రాసెసింగ్ చేసి…విగ్స్ గా విదేశాలకు తరలించేవాడు.! దీంతో కోట్లలో లాభాలు వచ్చాయి.!
శ్రీనివాస్ గుప్తా కు భార్య అంటే చెప్పలేనంత ప్రేమ. వీరికి ఇద్దరు అమ్మాయిలు.! తమకంటూ ఓ మంచి ఇల్లు ఉండాలనేది గుప్తా భార్య నాగమాధవి కల.! ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. భర్త కూడా ఓకే అనడంతో సొంతింటికి ప్లాన్ గీయించారు…ఇల్లు ఎలా ఉండాలి? అనే బాధ్యతను అంతా నాగమాధవే తీసుకుంది .
Advertisement
ఈ క్రమంలో …ఆ కుటుంబం 2017లో తిరుపతి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి నాగమాధవి మృతి చెందారు.! అప్పటి నుండి గుప్తా ఆమె జ్ఞాపకాల్లోనే బతుకుతున్నారు. ఆమె చిరకాల కోరిక అయిన ఇంటిని ఆమె కోరుకున్నట్టే కట్టించాలని ఆయనే దగ్గరుండి కట్టించుకున్నారు. 2020 ఆగస్ట్ 8 న గృహప్రవేశం పెట్టుకున్నాడు.
తన భార్య కల అయిన ఇంటి నిర్మాణమైంది…కానీ భార్య లేకుండా ఎలా? అని ఆలోచించి….బెంగుళూరు కు చెందిన మైనపు బొమ్మల తయారీ దారు అయిన శ్రీధర్ తో మాట్లాడి తన భార్య మైనపు బొమ్మను తయారు చేయించాడు. గుప్తా చెప్పినట్టుగా జీవం ఉట్టిపడేలా శ్రీధర్ నాగమాధవి మైనపు బొమ్మను తయారు చేసి ఇచ్చాడు. మాధవి జ్ఞాపకాలను తల్చుకుంటూ ….బాధను దిగమింగుతూ…. ఆ కుటుంబ సభ్యులు గృహప్రవేశం చేశారు.!
Advertisements
Watch Video :
How much do you miss the person you love? This man from Bellary, Karnataka lost his wife in a car accident. And during his housewarming today he ensured she was present…by getting her wax statue done. Beautiful work by the artist too. So life like. Love finds a way ♥️ pic.twitter.com/vZYGtWiS3W
— Revathi (@revathitweets) August 10, 2020
Advertisements