Advertisement
క్రికెట్ లో రైట్ హ్యాండ్ బ్యాటింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అనే మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా…? అసలు నిజంగా రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ లు ఉంటాయా…? క్రికెట్ గురించి సరిగా తెలిసిన వాళ్లకు ఉండవు, తెలియని వాళ్లకు మాత్రం ఉంటాయి. అదేంటీ అంటారా…? అదేంటో ఒకసారి చూద్దాం.
Also Read:నిద్ర గురించి తెలియని విషయాలు, ఆరోగ్యంగా ఉన్న వారికే అలాంటి ఫీల్ వస్తుందా…?
క్రికెట్ లో బ్యాటింగ్ చేసే సమయంలో రెండు గ్రిప్స్ ఉంటాయి ప్రధానంగా. ఒకటి టాప్ హ్యాండ్, మరొకటి బాటం హ్యాండ్ అన్నట్టు. టాప్ హ్యాండ్ గ్రిపులో పైచెత్తో బ్యాటును గట్టిగా పట్టుకుంటే…… కింది చెయ్యి మాత్రం కేవలం సపోర్ట్ ఇస్తుంది. అదే బాటం హ్యాండ్ గ్రిప్లో పై చేయి ఊరికే సపోర్టుగా ఉంటే క్రింద చేతితో బ్యాట్ ను గట్టిగా పట్టుకుంటారన్నమాట.
Advertisement
కుడిచేతివాటం వ్యక్తులు ఒక చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని కొట్టాలి అనుకున్నప్పుడు… టెన్నిస్, గోల్ఫులాగానే ఒక పక్కకు నిలబడి ఉంటారు. సహజంగా బ్యాటింగు చేసే సమయంలో ఎడమ కాలు బౌలరును ఫేస్ చేసే విధంగా స్టాన్స్ తీసుకుంటారు. దీన్ని రైట్ హ్యాండ్ బ్యాటింగ్ స్టాన్స్ అని పిలుస్తారు. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ వాటం బ్యాట్స్మెన్ కుడికాలు బౌలరుకు అభిముఖంగా నిలబడతారు.
Advertisements
అంతేగానీ ఇక్కడ రైట్ హ్యాండ్ బ్యాట్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ ఉండదు. ఒకవేళ ఎవరైనా కుడిచేతివాటం వ్యక్తి టాప్ హ్యాండ్ గ్రిపును వాడాలనుకుంటే మాత్రం లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ స్టాన్స్ తీసుకోవచ్చు. గంగూలి, గేల్, రైనా లాంటి వారు ఈ కోవలోకి వస్తారు. మనం గమనిస్తే… లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే కుడిచేతివాటం ఉన్న ఆటగాళ్ళు ఎక్కువగా డ్రైవ్, స్వీప్ ఇలాంటి షాట్లకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అదే లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు అయితే కట్, పుల్, ఫ్లిక్ వంటి షాట్స్ ఆడుతూ ఉంటారు.
Advertisements
Also Read:అసలు జీయర్ లు అంటే ఎవరు…? జీయర్ అని ఎందుకు పిలుస్తారు…?