Advertisement
ఈ ఫోటోలో ఓ పసిపాపకు పాలు పడుతున్నామె ఓ వాలంటీర్…ఈ పాపకే కాదు రోజుకు ఇలా 20 మంది పసిపిల్లలకు పాలిస్తుంది ఈమె.! ఉగ్రవాదులు భయాన్ని సృష్టించిన అదే హాస్పిటల్ లో ప్రేమను పంచుతుంది ఈ వాలంటీర్ …ఆమె పేరు ఫెరోజా యూనిస్ ఒమర్.
అప్ఘనిస్థాన్ రాజధాని కాబూలో లోని ఓ ప్రసూతి హాస్పిటల్ లో …పోలీస్ డ్రెస్ లో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదలు గ్రెనేడ్స్ వేశారు. తర్వాత కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో 20 మంది పసిపిల్లలను కలిగిన తల్లులు 2 డాక్టర్లు, 2 నర్సులు చనిపోయారు.
Advertisement
Advertisements
తల్లులను కోల్పోయిన వారిలో 20 మంది పిల్లల్లో ….10 రోజుల పాప నుండి 2 సంవత్సరాల బాలుడు వరకు ఉన్నారు. ఈ విషయం తెల్సుకున్న ఫెరోజా…. ఆ పిల్లలకు తన స్తన్యాన్నివ్వడానికి ముందుకు వచ్చింది. తన 18 నెలల బాబుతో పాటు ఇక్కడి 20 మంది పిల్లలకు పాలిచ్చి …తన కొడుకుతో పాటు ఈ 20 మంది పిల్లలకు కూడా తల్లైంది.
Advertisements
ఈ దాడి మే 11, 2020 లో జరిగింది. తాలిబన్లే ఈ పనిచేశారని అప్ఘనిస్థాన్ అధ్యక్షుడు ఘని అంటున్నారు. వారు చేసిన ఈ దారుణానికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.!