Advertisement
సంతానం కలగని దంపతులు ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇద్దరికీ సహజసిద్ధంగా పిల్లలు కలగకపోతే, ఇతర ఏ సమస్యా లేకపోతే నిరభ్యంతరంగా ఐవీఎఫ్‌కు వెళ్లవచ్చు. కానీ సమస్య ఉంటే ఐవీఎఫ్ కూడా సాధ్యం కాదు. ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు స్త్రీలు స్పెర్మ్ దానం ఇచ్చే డోనార్లపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఆ దంపతులు కూడా సరిగ్గా ఇలాగే ఓ డోనర్‌పై ఆధార పడ్డారు. కానీ చివరకు వారి జీవితం అస్తవ్యస్తంగా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ అక్కడి వస్త్రల్ అనే ప్రాంతంలో నివాసం ఉండే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి పెళ్లిని పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వారు వేరే దగ్గర ఇంట్లో నివాసం ఉండడం మొదలు పెట్టారు. అలా వారి దాంపత్య జీవితం నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా సాగింది. కానీ వారికి సంతానం కలగలేదు. వారికి సహజసిద్ధ పద్ధతిలో పిల్లలు కలగరని తెలుసుకుని వారు అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సఖి వన్ స్టాప్ సెంటర్ అనే ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఓ డోనర్ నుంచి వీర్యం తీసుకుని ఆమెకు ఐవీఎఫ్ చేశారు. సక్సెస్ అయింది. దీంతో ఆమె కవలలకు జన్మనిచ్చింది.
Advertisement
అయితే 5 ఏళ్లపాటు మళ్లీ సాఫీగానే కాలం గడిచింది. కానీ సదరు డోనర్‌తో ఆ మహిళ కలుస్తుందనే అనుమానంతో ఆ వ్యక్తి నిత్యం మద్యం సేవించి వచ్చి ఆమెతో గొడవపడేవాడు. దీంతో ఆమె అతని నుంచి విడిపోయి తన ఇద్దరు కవల పిల్లలతో కలిసి వేరేగా నివాసం ఉండడం మొదలు పెట్టింది. అయితే వారికి స్పెర్మ్ డొనేట్ చేసిన వ్యక్తి గురించి ఆమెకు ముందే తెలుసు. దీంతో ఆమె అతని వద్దకు వెళ్లి అతనితో స్నేహం చేసింది. అతను ఓ కోచింగ్ సెంటర్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరి మధ్య స్నేహం వారి సహజీవనానికి దారి తీసింది. దాంతో ఆమె గర్భవతి అయింది.
Advertisements
Advertisements
ఆ తరువాత ఆమెను అతను వదిలేశాడు. అంతేకాదు.. తాను స్పెర్మ్ డొనేట్ చేయడం వల్లే ఆ ఇద్దరు ట్విన్స్ పుట్టారు కనుక.. వారు తన పిల్లలే అని అతను వాదిస్తూ వారిని తన వెంట తీసుకెళ్లాడు. దీంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు గర్భంతో ఉంది. మరోవైపు చేతిలో డబ్బు లేదు. పనిచేద్దామంటే ప్రెగ్నెన్సీ అడ్డుగా ఉంది. కట్టుకున్న భర్త వదిలేశాడు. సహజీవనం చేసిన వ్యక్తి తన పిల్లలతో కలిసి వెళ్లిపోయాడు. ప్రేమ వివాహానాన్ని పెద్దలు ఆదరించలేదు కనుక పుట్టింటికి వెళ్లలేదు. దీంతో ఆమె నరక యాతన అనుభవించ సాగింది. చివరకు గత్యంతరం లేక ఆమె అక్కడి అభయం 181 హెల్ప్‌లైన్‌ను ఆశించింది. దీంతో వారు ఆమెను సంప్రదించి ఆమె విషయం తెలుసుకుని ఆమెకు సహాయం చేసే పనిలో పడ్డారు. ఆమె భర్తతోపాటు సహజీవనం చేసిన వ్యక్తితోనూ మాట్లాడి ఎవరో ఒకరి దగ్గర ఆమె ఉండేలా ఆమెకు ఏర్పాటు చేసేందుకు సదరు హెల్ప్‌లైన్ వారు ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారు. మరి ఆమె పరిస్థితి ఏమవుతుందో చూడాలి.