Advertisement
ప్రపంచంలో నిజంగానే కొందరు తల్లిదండ్రుల మనస్తత్వం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. స్వయానా కడుపున పుట్టిన పిల్లలే కీర్తించబడుతుంటే ఓర్వలేరు. పిల్లలు అందంగా ఉంటే వారికి ఆ అందం లేకుండా చేస్తారు. వారు జీవితాంతం సుఖపడకుండా చేస్తారు. కొందరైతే ఇంకాస్త ముందుకు వెళ్లి సైకోయిజాన్ని ప్రదర్శిస్తారు. దీంతో కొందరు పిల్లలు జీవితాంతం పోరాడి చివరకు చనిపోతారు. ఆ యువతి విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది.
ఆమె పేరు బ్లాంచి మానియర్. 1849లో ఫ్రాన్స్‌లో ధనిక కుటుంబంలో జన్మించింది. ఆమె అప్పట్లో ఎంత అందంగా ఉండేందంటే.. ఎంతో మంది ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చారు. ఆమె అందంలోనే కాదు.. గుణంలోనూ మేటి. విలువలు ఉన్న వ్యక్తి. అందుకనే చాలా మంది యువకులు ఆమెను వివాహం చేసుకునేందుకు పోటీ పడ్డారు.అయితే మానియర్……వీళ్లెవ్వరినీ ఇష్టపడకుండా….తన కంటే వయస్సులో చాలా పెద్ద అయిన ఓ లాయర్ ను ఇష్టపడుతుంది.!అతన్నే పెళ్లి చేసుకుంటానని తల్లికి చెబుతుంది! తమ ఆస్తికి అంతస్తకు తగని వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వనని అంటుంది మానియర్. ఎంత చెప్పిన కూతురు వినకపోవడంతో …. తల్లి కోపంతో ఆమెను విపరీతంగా కొట్టి ఓ చీకటి రూంలో బంధించింది.
Advertisement
బ్లాంచి మానియర్ అలా చీకిటి రూంలో దాదాపుగా 25 ఏళ్ల పాటు జీవచ్ఛవంలా బతికింది. ఆమెను ఒక బెడ్‌పై బంధించండంతో అదే బెడ్‌పై తిండి తినాల్సి వచ్చేది. మలమూత్రాలు కూడా దానిపైనే చేయాల్సి వచ్చేది. ఇక సూర్యరశ్మి అస్సలు తగిలేది కాదు. దీంతో ఆమె 25 ఏళ్ల పాటు సూర్యుడు అంటే ఎలా ఉంటాడో కూడా మరిచిపోయింది. తరువాత 1901లో ప్యారిస్ అటార్నీ జనరల్ ఆ యువతిని రక్షించాలని లేఖ రాశారు. దీంతో ఆమెకు ఎట్టకేలకు విముక్తి లభించింది.
Advertisements
Advertisements
కొందరు అధికారులు వచ్చి బ్లాంచి మానియర్‌ను విడిపించారు. ఆమె ఉన్న గది తలుపులు తెరవగానే ఒక్కసారిగా దారుణమైన దుర్గంధం బయటకు వచ్చింది. ఆమెను ఆ స్థితిలో చూసిన వారు నిశ్చేష్టులయ్యారు. ఒంటిపై అసలు దుస్తులు లేవు. పూర్తిగా అస్థిపంజరంలా శరీరం మారింది. తైల సంస్కారం లేక జుట్టు అట్టలు కట్టింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఆమె బతికి ఉన్న శవంలా వారికి కనిపించింది. అందులోనూ బాగా చిక్కిపోయి శల్యమైన దశలో ఆమె వారికి దర్శనమిచ్చింది. ఈ క్రమంలో అధికారులు ఆమెను గది నుంచి బయటకు తీసుకురాగా ఎట్టకేలకు 25 ఏళ్లకు ఆమె సూర్యకాంతిని చూసింది.
అలా ఆమె ఆ చీకటి గది నుంచి బయటపడినా.. ఆమె ఎక్కువ సంవత్సరాలు బతకలేదు. 1913లో చనిపోయింది. షిజోఫ్రీనియా, ఎగ్జిబిషనిజం, కాప్రోఫిలియా అనే వ్యాధులతో ఆమె మృతి చెందింది. వైద్యులు ఆమెకు చికిత్సను అందించినా ఫలితం దక్కలేదు. అలా ఆ యువతి జీవితం పాపం నరకకూపంలా గడిచింది. పైన చిత్రంలో ఒక వైపు ఉన్నది యుక్త వయస్సులో ఉన్న బ్లాంచి మానియర్. రెండో చిత్రంలో ఉన్నది అధికారులు ఆమెను రక్షించినప్పుడు తీసినది. ఆ రెండు చిత్రాలు చాలు.. ఆమె ఎంతలా వేదన అనుభవించిందో చెప్పడానికి. ఇలా ఎవరికీ జరగకూడదనే కోరుకోవాలి..!