Advertisement
సైన్స్ ఇంతగా అభివృద్ది చెందుతున్నా, మానవుడు అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్నా..సంప్రదాయాల పేరిట మూఢనమ్మకాలను మాత్రం వదలడం లేదు. దురదృష్టాన్ని మూట కట్టుకోవడం కంటే చిన్నచిన్న నమ్మకాలను పాటిస్తే సరిపోతుంది కదా అనుకుంటూఉంటారు..మంగళవారం,శనివారం గోర్లు కత్తిరించకూడదు.. పిల్లి ఎదురొస్తే వెళ్లకూడదు.. దిష్టితగలకుండా ఉండాలంటే కాటుక బొట్టు పెట్టుకోవాలి..ఇవి మనం తరచుగా చూసే,పాటించే కొన్నినియమాలు.. మనదేశంలో వివిధ ప్రాంతాల్లో పాటించే కొన్ని మూఢనమ్మకాలు ఏంటో చూద్దామా..
Advertisements
Advertisement
- పురాణాల్లో ద్రౌపది ఐదుగురిని చేసుకుందని విన్నాం కానీ, హిమాచల్ ప్రదేశ్లో కన్నూర్ ప్రాంతంలో ఒక ఆడపిల్ల ఒక వ్యక్తిని చేసుకోవడం నిషిద్దం.. వరుడితో పాటు ఆ కుటుంబంలోని మగాళ్లందరిని వివాహం చేసుకోవడం వారి సంప్రదాయం..
- వర్షాలు పడకపోతే కప్పలకు పెళ్లిల్లు చేయండ్రా అంటూ వింటాం,ఒకవేళ ఎక్కువ వర్షాలు పడితే ఆ పెళ్లి చేసిన కప్పలకు విడాకులు ఇప్పించండిరా అని జోక్స్ వేసుకుంటాం..కానీ వర్షాల కోసం కప్పలకు పెళ్లిల్లు చేసే సంప్రదాయం ఉంది..నేటికి దాన్ని ఫాలో అవుతూ ఉంటారు.. ఇలా కప్పలకు పెళ్లి చేయడం వల వాన దేవుడైన ఇంద్రుడు సంతోషించి వానలు కురిపిస్తాడని కొందరి నమ్మకం.
- పెళ్లి తర్వాత అమ్మాయిలు పుట్టిల్లు వదిలి అత్తగారింట్లో బతకాల్సిందే..దేశం మొత్తం ఇదే రూల్ ఫాలో అవుతుంది..ఒక్క మేఘాలయాలోతప్ప..అక్కడ వివాహనంతరం వరుడి పెట్టేబేడా సర్దుకుని అత్తారింటికి మకాం మార్చాల్సిందే..!
- ఝార్ఖండ్లో ప్రజలు దెయ్యాలున్నాయని,అతీంద్ర శక్తులున్నయని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.అమ్మాయిలు చుట్టూ ఉన్న దుష్టశక్తులను యం చేయడానికి ,ఆ అమ్మాయిని ఒక కుక్కతో పెళ్లి చేస్తారు.ఇలా చేయడం వలన ఆమె చుట్టూ ఉన్న దుష్టశక్తులు దూరం అవుతాయని వారి నమ్మకం.
- దీనంత భయంకరమైన సంప్రదాయం మరొకటి ఉండదేమో..మధ్యప్రదేశలోని గోవర్దన్ పూజ రోజున , కొన్ని గ్రామాలకు చెందిన వారు ఆవులతో తొక్కించుకుంటూ ఉంటారు.ఇలా చేయడం వలన కోరిక కోరికలు తీరతాయని ప్రజల నమ్మకం.
- బ్యాచిలర్ గా ఉన్న మగాళ్లు పెళ్లి చేసుకోవాలంటే ముందు ఆడవాళ్ల చేతుల్లో దెబ్బలు తినాల్సిందే..రాజస్థాన్లోని ఒక తెగలో పెళ్లికి సిధ్దంగా ఉన్న అబ్బాయిల్ని ఆడవాళ్లు బాగా కొడతారు..ఆ మగాడు అమ్మాయిల దెబ్బలు తట్టుకున్నట్టైతే అతను పెళ్లికి సిద్దంగా ఉన్నట్టర్దమట.
- గ్రహణం ముందు గర్భిణులు,పిల్లల పట్ల మన ఇల్లల్లో జాగ్రత్తలు తీసుకుంటారు తెలిసిన విషయమే..కానీ, గుల్బార్గా లోని మోమిన్ పూర్ లో పిల్లల్ని మెడ వరకు భూమిలో కప్పేట్టేస్తారు.ఇలా చేయడం వలన గ్రహణం ఎఫెక్ట్ పిల్లలపై పడకుండా ఆరోగ్యంగా పెరుగుతారని అక్కడ వారి నమ్మకం..
Advertisements