Advertisement
సెరెబ్రెల్ హామరేజ్ కారణంగా మిసెస్ డ్యు 3 ఏళ్ల కిందట వెజిటేటివ్ పేషెంట్‌గా మారింది. వెజిటేటివ్ పేషెంట్ అంటే.. అదొక అరుదైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారికి తమ చుట్టూ ఉన్న పరిసరాల పట్ల అవగాహన ఉండదు. కళ్లు తెరిచి ఉన్నా చుట్టూ ఉన్న వాటిని గమనించలేరు. మాట్లాడలేరు. తినలేరు. నడవలేరు. ఈ వ్యాధి రావడంతో ఆమె భర్త మిస్టర్ డ్యు ఆమెకు ఖరీదైన వైద్యం చేయించసాగాడు. ఇప్పటి వరకు దాదాపుగా ఆమె వైద్యం కోసం 6 లక్షల యువాన్స్ ఖర్చు చేశాడు. అయినా ఆమె పరిస్థితి మారలేదు.
అయితే మిస్టర్ అండ్ మిసెస్ డ్యులు పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తలుగా జీవిస్తున్నారు. వారికి జిన్యూ అనే కుమార్తె జన్మించింది. ఆమెకు ఇప్పుడు 11 ఏళ్లు. మిస్టర్ అండ్ మిసెస్ డ్యు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. కానీ ఆమెకు ఉన్న వ్యాధి కారణంగా ఆమె తన కల తీర్చుకోలేకపోయింది. అయితే ఆమె కల గురించి తెలుసుకున్న ఆమె కుమార్తె జిన్యూ ఆమెకు, తన తండ్రికి పెళ్లి చేయాలని చెప్పి వెడ్డింగ్ డ్రెస్ కోసం అన్వేషించింది.
Advertisement
కానీ వెడ్డింగ్ డ్రెస్ కొనేందుకు జిన్యూ వద్ద డబ్బులు లేవు. అయితే ఓ షాప్‌లో వెడ్డింగ్ డ్రెస్‌లను అద్దెకు ఇస్తారని తెలుసుకుని తనకు దొరికే ఫ్రీ టైంలో పెయింటింగ్ వేయడం, బాటిల్స్ ఏరడం, ఇతర పనులు చేయడం ద్వారా కొద్ది కొద్దిగా డబ్బును పొదుపు చేసింది. అయినా వెడ్డింగ్ డ్రెస్‌ను అద్దెకు తీసుకునేంత డబ్బు ఆమె వద్ద జమకాలేదు. అయితే ఆ షాప్ ఓనర్ ఆమె పరిస్థితి చూసి వెడ్డింగ్ డ్రెస్‌ను అద్దెకు ఇచ్చాడు. దీంతో జిన్యూ తన తల్లి కల నెరవేర్చింది. ఆమెకు వెడ్డింగ్ డ్రెస్ వేసి ఫంక్షన్ చేసింది.
అయితే మిసెస్ డ్యుకు వ్యాధి నయం అయ్యాక గ్రాండ్‌గా మళ్లీ పెళ్లి చేసుకుందామని ఆమె భర్త ఆమెకు చెబుతున్నాడు. త్వరగా లే.. నీ వ్యాధి నయం అవుతుంది, మనం పెళ్లి చేసుకుందాం.. అని నిత్యం అతను తన భార్యకు ధైర్యం చెబుతున్నాడు. అయితే మిసెస్ డ్యుకు ఆపరేషన్ చేస్తే వ్యాధి నయం అయి మళ్లీ మామూలు మనిషి అయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెప్పారు. కానీ అందుకు 3 లక్షల యువాన్స్ ఖర్చవుతాయని వైద్యులు చెప్పారు. అంత డబ్బు అతని వద్ద లేదు. దీంతో విరాళాల కోసం అతను ఎదురు చూస్తున్నాడు. మనస్సున్న దాతలు సహాయం చేస్తే తన భార్యకు వ్యాధి నయం అవుతుందని, కనుక తనకు సహాయం చేయాలని అతను ఆశగా ఎదురు చూస్తున్నాడు. సోషల్ మీడియాలో అతని స్నేహితులు కొందరు క్రౌడ్ ఫండింగ్ కూడా మొదలు పెట్టారు.
Advertisements
ఎప్పటి కైనా మిసెస్ డ్యుకు ఆపరేషన్ అవుతుందని, తాము గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటామని, జిన్యూ తన తల్లితో హ్యాపీగా ఉండవచ్చని.. మిస్టర్ డ్యు ఆశపడుతున్నాడు. అతని కల నెరవేరాలని కోరుకుందాం.
Advertisements