Advertisement
వైవిధ్యభరితమైన ప్రొడక్ట్స్ ను రూపొందించి వినియోగదారులకు అందించడంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఎప్పుడూ ముందుగానే ఉంటుంది. ఆ సంస్థకు చెందిన ఐఫోన్లే కాదు, ఇతర డివైస్‌లు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు కూడా యూజర్లను ఆకట్టుకుంటాయి. అయితే యాపిల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన స్టోర్లను కూడా భిన్న రకాల శైలితో ఏర్పాటు చేస్తుంటుంది. అందులో భాగంగానే సింగపూర్‌లో యాపిల్ సంస్థ తొలిసారిగా నీటిపై తేలియాడే ఓ స్టోర్‌ను ఏర్పాటు చేసింది.
సింగపూర్‌లోని మెరీనా బే శాండ్స్ లో యాపిల్ సంస్థ నీటిపై తేలియాడే స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని సెప్టెంబర్ 10 నుంచి అందుబాటులోకి తెస్తున్నారు. కాగా ఈ స్టోర్ మొత్తం గుండ్రంగా ఉంటుంది. దాదాపుగా 114 పీసుల గ్లాస్‌తో ఈ స్టోర్‌ను డిజైన్ చేశారు. అందులో ఉండి చూస్తే సింగపూర్ స్కైలైన్ 360 డిగ్రీ పనోరమిక్ వ్యూ కనిపిస్తుంది.
Advertisement
ఇక ప్రపంచంలోనే ఈ తరహా స్టోర్‌లలో ఇదే మొదటిది కాగా.. సింగపూర్‌లో ఇప్పటికే రెండు యాపిల్ స్టోర్లు ఉన్నాయి. ఇది అక్కడ 3వ స్టోర్. ఈ క్రమంలోనే ఈ స్టోర్ ఇప్పుడక్కడ జనాలను ఆకర్షిస్తోంది. ఇందులో 10 చెట్లను కూడా నాటారు. లోపలి భాగంలోకి పైన ఉండే రంధ్రం నుంచి గాలి, వెలుతురు వస్తాయి. లోపలి భాగం మొత్తం రాత్రి పూట ఎఫెక్ట్ వచ్చేలా ఏర్పాటు చేశారు. అలాగే పూర్తి పర్యావరణ హితంగా ఈ స్టోర్‌ను తీర్చిదిద్దారు.
Advertisements
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో యాపిల్ అధికారిక స్టోర్లు ఉండగా.. ఇది యాపిల్‌కు 512వ స్టోర్ కావడం విశేషం. ఇందులో 148 మంది సిబ్బంది పనిచేస్తారు. వీరు 23 భాషలను మాట్లాడగలరు. ఇక ఈ స్టోర్ దిగువ భాగంలో అండర్ వాటర్‌లో ఓ బోర్డ్ రూం ఉంటుంది. ఇది కంపెనీకి చెందిన మొదటి అండర్ వాటర్ బోర్డ్ రూమ్ కావడం విశేషం. ఇందులో యాపిల్ క్రియేటివ్స్, ఎంటర్‌ప్రిన్యూర్లు, డెవలపర్లు పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు.
Advertisements