Advertisement
ప్రపంచవ్యాప్తంగా హిందువులకు అనేక ఆలయాలు ఉన్నాయి. భారతదేశంలోనే కాదు.. అనేక ఇతర దేశాల్లోనూ ఆలయాలు ఉన్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నింటిలోనూ అత్యంత పెద్దదైన ఆలయం ఏది ? అనే ప్రశ్న వేస్తే మాత్రం.. అందుకు.. నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయం అని సమాధానం వస్తుంది.
అవును.. విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలోనే ఈ ఆలయం అతి పెద్దది. దీన్ని క్రీస్తుశకం 5వ శతాబ్దంలో నిర్మించారు. తరువాత మల్ల రాజులు పునర్నిర్మాణ పనులు చేపట్టి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అయితే ఈ సహస్రాబ్ది ప్రారంభం నుంచే ఇక్కడ ఆలయం ఉండేదని తెలుస్తోంది. శివలింగాన్ని అప్పట్లోనే ఇక్కడ గుర్తించారట. దాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది.
పశుపతినాథ్ ఆలయ స్థలంలో మొత్తం 492 చిన్న ఆలయాలు ఉంటాయి. 15 శివలింగాలు ఉంటాయి. 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ప్రధాన ఆలయం పైకప్పు రెండు అంతస్థులు ఉంటుంది. దాన్ని రాగితో తయారు చేశారు. పై భాగంలో బంగారం పూత ఉంటుంది. అలాగే అద్భుతమైన చెక్క కళాకృతులతో కప్పులను తీర్చిదిద్దారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నాక భక్తులు ఏమైనా కోరుకుంటే త్వరలోనే అది నెరవేరుతుందని నమ్ముతారు. ఆలయం ఎదుట భారీ నంది విగ్రహం ఉంటుంది. దాన్ని బంగారంతో తయారు చేశారు.
Advertisements
Advertisement
ప్రధాన ఆలయంలోకి కేవలం హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన వారిని అనుమతించరు. కానీ ప్రధాన ఆలయం కాకుండా చుట్టూ ఉండే ఇతర ఆలయాల్లోకి ఎవరైనా వెళ్లవచ్చు. ఆలయం సమీపంలో తూర్పు దిశగా నదీ తీరాన్ని వీక్షించవచ్చు. అక్కడి ప్రకృతి మనోహరంగా దర్శనమిస్తుంది. బాగమతి నదికి పశ్చిమాన 5 దేవాలయాలు ఒకే చోట ఉంటాయి. అక్కడ వృద్ధులకు ప్రస్తుతం ఆశ్రయం ఇస్తున్నారు.
ఏప్రిల్ 2015లో నేపాల్‌లో భూకంపం వచ్చినప్పుడు దాని ప్రభావం పశుపతినాథ్ ఆలయంపై పడింది. దీని వల్ల ఆలయ ప్రాంగణంలోని కొన్ని నిర్మాణాలు బాగా ధ్వంసమయ్యాయి. ఇక పశుపతినాథ్ ఆలయం మొత్తం విస్తీర్ణం 264 హెక్టార్లు కాగా అందులో మొత్తం 518 ఆలయాలు ఉంటాయి.
Advertisements
అయితే కంబోడియాలో ఉన్న అంగ్‌కోర్ అనబడే మరో ఆలయం కూడా ప్రపంచంలోని అత్యంత పెద్దవైన ఆలయాల్లో రెండో స్థానంలో ఉంది. ఈ ఆలయ విస్తీర్ణం 162.6 హెక్టార్లు కాగా.. దీన్ని 9వ శతాబ్దంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. అప్పటి ఖ్మేర్ రాజులు దీన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆలయంలో విగ్రహం ఎత్తు 65 మీటర్లు ఉంటుంది. విగ్రహాల ప్రకారం చూస్తే.. ఈ ఆలయమే ప్రపంచంలో అత్యంత పెద్దదైన ఆలయం అని చెప్పవచ్చు.