Advertisement
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అనేక కార్లలో రక రకాల సేఫ్టీ ఫీచర్లు లభిస్తున్నాయి. సీట్ బెల్టులు, ఎయిర్ బ్యాగులు, కార్లకు ముందు బంపర్లు.. ఇలా అనేక రకాల సేఫ్టీ ఫీచర్లు మనకు కార్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే 1950లకు చెందిన ఓ కారులో మాత్రం ఈ ఫీచర్లేవీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆ కారు మృత్యుశకటం అని చెప్పవచ్చు. అంతటి ప్రమాదకరంగా ఉంటుంది. ఇంతకీ ఆ కారు ఏమిటంటే…
1950లలో బీఎండబ్ల్యూ కంపెనీ ఐసెట్టా అనే కారును తయారు చేసి అమ్మింది. చిత్రంలో ఆ కారును చూశారుగా. అందులో సేఫ్టీ ఫీచర్లు ఏమీ ఉండవు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అందులో ప్రయాణించే వారు చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సేఫ్టీ ఫీచర్లు అసలు ఏమీలేవు. ముందు భాగానికి ఏదైనా డ్యాష్ ఇచ్చి యాక్సిడెంట్ అయితే డ్రైవర్‌కు, యాక్సిడెంట్ కు మధ్య ఉండేది సింగిల్ డోర్ మాత్రమే. అందువల్ల ప్రమాదానికి గురైతే ఇందులో ప్రయాణించేవారు తీవ్రగాయాలకు గురై చనిపోవడం ఖాయం.
Advertisements
Advertisement
ఇక చిత్రంలో కారు డోర్‌కు అటాచ్‌మెంట్‌గా స్టీరింగ్‌ను చూడవచ్చు. అది పూర్తిగా నిట్టనిలుగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ కార్ డోర్ మూస్తే స్టీరింగ్ ఛాతి వద్దకు వస్తుంది. అందువల్ల యాక్సిడెంట్ అయితే.. ఛాతి భాగం పూర్తిగా ధ్వంసం అవడం ఖాయం. ఇక కార్ బంపర్ కూడా చాలా చిన్నగా.. అది కూడా కిందకు ఉంది. అందువల్ల దాన్ని ఇచ్చి కూడా ప్రయోజనం లేదని చెప్పవచ్చు. అలాగే కార్ డోర్లు కూడా చిన్న రేకుల్లా ఉంటాయి. ఏదైనా పక్కన వచ్చి డ్యాష్ ఇస్తే అంతే సంగతులు.
Advertisements
ఈ కారుకు 3 వీల్స్ మాత్రమే ఉంటాయి. అందువల్ల ఏదైనా వాహనం పక్కన తగిలినా.. లేదా ఒంపు ప్రదేశంలో, గుంతల్లో, స్పీడ్ బ్రేకర్లపై ప్రయాణించినా.. ఈ కారు పక్కకు ఒరిగిపోయి ప్రమాదం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఎటు చూసినా ఈ కారు వల్ల ప్రమాదం కచ్చితంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఎంత నెమ్మదిగా వెళ్లినా సరే.. కచ్చితంగా ప్రమాదం బారిన పడడం ఖాయం. కానీ అంత పెద్ద కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ ఈ కారును అసలు ఎలా తయారు చేసిందో తెలియదు. ఇప్పుడు అదే కంపెనీ కార్లతో పోలిస్తే.. ఆ కారు ఎంత చెత్త కారో మనకు ఇట్టే అర్థమవుతుంది. మరలాంటిది ఆ కారును ఆ కంపెనీ ఎలా తయారు చేసిందా.. అనే ప్రశ్న ఇప్పటికీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది.