Advertisement
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. వాటిల్లో స్మార్ట్ ఫోన్ రంగం కూడా ఒకటి. భారత్‌లోనైతే దాదాపుగా 2 నెలల పాటు లాక్‌డౌన్ వల్ల ఫోన్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయితే ఆంక్షలను సడలించడంతో ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. ఇక.. స్మార్ట్ ఫోన్ మార్కెట్ విషయానికి వస్తే.. కరోనా కాలంలోనూ 2020 ప్రథమార్థంలో జనాలు ఫోన్లను ఎక్కువగానే కొన్నారు. అలాగే పలు ఫోన్లు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్న ఫోన్ల జాబితాలో నిలిచాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వివరాలను ఒమిడియా అనే సంస్థ వెల్లడించింది. 2020 ప్రథమార్థంలో.. అంటే జనవరి నుంచి జూన్ నెల వరకు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1. యాపిల్ ఐఫోన్ 11
2019లోనే ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఐఫోన్‌కు గాను యాపిల్ మొత్తం 3.77 కోట్ల ఐఫోన్ 11 ఫోన్లను అమ్మింది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.64,900గా ఉంది.
2. శాంసంగ్ గెలాక్సీ ఎ51
Advertisements
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ల జాబితాలో ఈ ఫోన్ రెండో స్థానంలో నిలిచింది. శాంసంగ్ ఈ ఫోన్‌కు గాను ఇప్పటి వరకు 1.14 కోట్ల యూనిట్లను విక్రయించింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇది రూ.23,999 ప్రారంభ ధరకు లభిస్తోంది.
3. షియోమీ రెడ్‌మీ నోట్ 8
షియోమీ తన రెడ్‌మీ నోట్ 8 ఫోన్‌ను ఇప్పటి వరకు 1.1 కోట్ల యూనిట్ల వరకు విక్రయించింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.12,799గా ఉంది.
4. షియోమీ రెడ్‌మీ నోట్ 8 ప్రొ
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్‌లో ఈ ఫోన్ 4వ స్థానంలో నిలిచింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.17వేలుగా ఉంది.
5. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020:
Advertisement
ఈ ఫోన్‌ను యాపిల్ 2020 ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. దీన్ని యాపిల్ ఇప్పటి వరకు 87 లక్షల సంఖ్యలో విక్రయించింది. ఈ ఫోన్ భారత్‌లో రూ.37,900 ప్రారంభ ధరకు లభిస్తోంది.
6. ఐఫోన్ ఎక్స్ఆర్:
ఈ ఫోన్ ఈ ఏడాది మాత్రమే కాదు.. గతేడాది కూడా బెస్ట్ సెల్లింగ్ ఫోన్ల జాబితాలో నిలిచింది. ఈ ఏడాది టాప్ 10 సెల్లింగ్ ఫోన్స్ లో 6వ స్థానంలో నిలిచింది. ఈ ఫోన్ రూ.47,500 ధరకు లభిస్తోంది.
7. ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్:
యాపిల్‌కు చెందిన ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ ఫోన్ టాప్ 10 సెల్లింగ్ ఫోన్ల జాబితాలో 7వ స్థానంలో నిలిచింది. ఈ ఫోన్ కు యాపిల్ ఇప్పటి వరకు 77 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ ఫోన్ ప్రారంభ ధర భారత్‌లో రూ.1,11,600గా ఉంది.
8. షియోమీ రెడ్‌మీ 8ఎ
మన దేశంలో అతి తక్కువ ధరకు లభిస్తున్న ఫోన్ల జాబితాలో ఈ ఫోన్ గుర్తింపు పొందింది. అలాగే టాప్ 10 సెల్లింగ్ ఫోన్స్ జాబితాలో ఈ ఫోన్ 8వ స్థానంలో నిలిచింది. ఈ ఫోన్‌కు గాను షియోమీ ఇప్పటి వరకు 73 లక్షల యూనిట్లను విక్రయించింది. రూ.7499 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభిస్తోంది.
9. షియోమీ రెడ్‌మీ 8
షియోమీ ఈ ఫోన్‌ను ఇప్పటి వరకు 68 లక్షల యూనిట్లను విక్రయించింది. రూ.9,999 ధరకు ఈ ఫోన్ లభిస్తోంది.
10. యాపిల్ ఐఫోన్ 11 ప్రొ:
ఈ ఫోన్‌కు గాను యాపిల్ ఇప్పటి వరకు 67 లక్షల యూనిట్లను విక్రయించింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 ఫోన్లలో ఈ ఫోన్ 10వ స్థానంలో నిలిచింది. ఈ ఫోన్ రూ.1,06,600 ప్రారంభ ధరకు భారత్‌లో లభిస్తోంది.
Advertisements