Advertisement
తెలుగు సినిమాల్లో రెగులర్ ఫార్ములా కాకుండా కొంచెం వైవిధ్యం కలగలిసిన కాన్సెప్ట్స్ తో మూవీస్ చేయడం చాలా తక్కువ.! అలాంటి రేర్ కాన్సెప్ట్స్ లో …. యముడి కాన్సెప్ట్ ఒకటి .! బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ అయిన ఈ ఫార్ములా ప్రేక్షకులను విపరీతంగా అలరించి…వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ గా మిగిలిపోయింది.
యముడు ఫార్ములాతో వచ్చిన తెలుగు సినిమాలు:
1. దేవాంతకుడు
1960 లో యముడు ఫార్ముల తో మొదలైన మొట్ట మొదటి తెలుగు సినిమా దేవాంతకుడు . ఈ సినిమాలో ఎస్ వి రంగారావు యముడిగా , ఎన్టీఆర్ నరుడిగా యాక్ట్ చేసి మెప్పించారు . ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Advertisements
2. యమగోల
చాలాకాలం తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ఏ 1977 లో యమగోల అనే సినిమా చేసాడు . ఇందులో యమలోకంలో ఎన్టీఆర్ చేసే హడావుడి అందరిని అలరించింది . యముడి కార్యరెక్టర్ లో కైకాల సత్యనారాయణ ఒదిగిపోయాడు అయ్యాడు . సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది .
3. యముడికి మొగుడు
1988 లో ఇదే ఫార్ములా తో చిరంజీవి హీరోగా యముడికి మొగుడు సినిమా చేసాడు . ఆ సినిమా సంచలనం సృష్టించింది . యమలోకంలో చిరంజీవి బ్రేక్ డాన్స్ , ప్రేక్షకులను భలే ఆకట్టుకున్నాయి . ఈ సినిమాలో కూడా యముడి పాత్ర సత్యనారాయణ చేశారు .
4. యముడన్నకి మొగుడు
1992 లో సుమన్ హీరోగా యముడన్నకి మొగుడు సినిమా చేసారు . ఈ సినిమాలో యముడి పాత్రలో కోట శ్రీనివాసరావు నటించాడు . ఈ సినిమా ప్రజలను అంతలా ఆకట్టుకోలేక పోయింది .
5. యమలీల
1994 లో ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కమిడియన్ ఆలీ హీరో గా వచ్చిన సినిమా యమలీల . ఇది చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది . ఇందులో కూడా యముడి పాత్రలో సత్యనారాయణ నటించాడు . ఆ సమయంలో ఈ సినిమా నాగార్జున , వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పోటీపడింది అంటే మాములు విషయం కాదు .
Advertisement
6. యమజాతకుడు
1999 వ సంవత్సరంలో మోహన్ బాబు హీరోగా వచ్చిన సినిమా యమజాతకుడు . ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించి మంచి విజయం సాధించింది.
7. యమగోల మళ్ళీ మొదలైంది
2007 లో రిలీజ్ అయిన యమగోల మళ్ళీ మొదలైంది సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయం సాధించింది . ఈ సినిమాలో సత్యనారాయణ యముడి పాత్రలో మళ్ళీ అలరించాడు .
8. యమదొంగ
2007 లో రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరో గా వచ్చిన సినిమా యమదొంగ . ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది . ఈ సినిమాలో యముడి పాత్రలో మోహన్ బాబు నటించగా , కొన్ని సీన్స్ లో స్వయంగా ఎన్టీఆర్ ఏ యముడి పాత్రలో కనిపించడం స్పెషల్ ఆకర్షణ .
9. దరువు
2012 లో రవితేజ చేసిన దరువు సినిమా కూడా యమలోకం ఫార్ములాతో వచ్చిందే . ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయినా పర్వాలేదు అనిపించింది .
10. యముడికి మొగుడు
2012 లో అల్లరి నరేష్ హీరోగా చేసిన యముడికి మొగుడు సినిమా , అంతలా ప్రేక్షకులను అలరించలేక పోయింది .
యమలీల తీసిన ఎస్ వి కృష్ణారెడ్డి 2014 లో దానికి సీక్వెల్ గా కొత్త హీరోని పెట్టి చేసిన యమలీల 2 బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పాలయింది.
Advertisements