Advertisement
మనం రైల్వే స్టేషన్స్ లో చాలా సార్లు ఈ లైన్ చూసే ఉంటాం. రైల్వే ట్రాక్ కు కాస్త దూరంలో కొన్ని కొన్ని చోట్ల యెల్లో లైన్ మరికొన్ని చోట్ల వైట్ లైన్ ఉంటుంది. ట్రైన్ ఎక్కాలన్న తొందర్లో ట్రైన్ రాక ముందే మనలో చాలా మంది ఆ లైన్ దాటి మరీ రెడీగా ఉంటారు…ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కుదామా అని.!
Advertisement
ఈ సారి అలాంటి తప్పు చేయకండి….అలా చేయడమంటే ప్రాణాలతో చెలగాటం ఆడడమే.! వేగంగా వస్తున్న ట్రైన్ తన ముందు ఎక్కువ పీడనాన్ని కలిగిస్తుంది. మీరు నిల్చున్న ప్రాంతం తక్కువ పీడనంతో ఉంటుంది. ఆటోమెటిక్ గా మీ వెనుక నుండి ఓ బలం ఎక్కువ పీడనంవైపుగా తోస్తుంది..మీరు ట్రైన్ కింద పడిపోవడమో, ట్రైన్ కు గుద్దుకోవడమో జరగొచ్చు.!
బెర్నౌలీ సూత్రం అని స్కూల్లో చదివే ఉంటారు… ఫ్యాన్ తిరిగేటప్పుడు, గోడకున్న క్యాలెండర్ గోడకు అతుక్కోకుండా ఫ్యాన్ వైపుకు ఎగురుతుంది కదా…అదేవిధంగా ఈ లైన్ కు దగ్గర్లో ఉంటే మీరూ ట్రైన్ వైపుగా ఆకర్షించబడతారన్నమాట.!
Advertisements