Advertisement
సినిమాలలో,సీరీస్ లలో చూపించినట్టుగా వయసు ఎంత పెరిగినా శరీరం పెరగకుండా నిత్య యవ్వనంగా ఉండడం నిజజీవితంలో కూడా సాధ్యమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.మరి అది నిజంగా సాధ్యమవుతుందా? లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
అమెరికాలోని, మేరీల్యాండ్ కు చెందిన బ్రూక్ గ్రీన్బెర్గ్ జనవరి 8వ తేదీన1993 లో జన్మించింది.ఈమె ప్రపంచంలోనే రేరెస్ట్ డిసీజ్ అయిన సిండ్రోమ్ ఎక్స్ తో బాధపడుతుందని దీనివల్ల బ్రూక్ శారీరక పెరుగుదల ఆగిపోయిందని బ్రూక్ మెదడు, శరీరమూ రెండూ ఎదగడం ఆగిపోయాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisements
కూతురు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని తెలిసిన ఆమె తల్లిదండ్రులు ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నారు.కానీ బ్రూక్ ఆరోగ్య సమస్య వల్ల తన ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించింది దానితో బ్రూక్ అక్టోబర్ 24,2013న మరణించింది.ఆమె మరణించినప్పటికీ పరిశోధకులు ఈ రేర్ డిసీజ్ గుట్టు విప్పటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.అలాగే ఆమె శరీరంపై మనుషులు శాశ్వత యవ్వనానికి కావల్సిన రసాయనాలు బయటపడతాయి ఏమో అని రీసెర్చ్ చేస్తున్నారు.మరి ఈ ప్రయోగాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.
Advertisements