Advertisement
జూన్ 30 లోపు PAN కార్డు కు ఆధార్ లింక్ చేయకపోతే… ఇన్‌కమ్‌ట్యాక్స్ యాక్ట్ 272 B ప్రకారం ఏకంగా రూ.10వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది. లింక్ చేయకపోతే ఐటీ రిటర్న్స్ కూడా రిజెక్ట్ చేయబడతాయి. గతంలో ఆధార్, పాన్ అనుసంధానానికి మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించారు. కానీ దేశంలో కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
పాన్ కార్డ్ ను ఆధార్ తో లింక్ చేసే విధానం:
METHOD -1 :
ఇక పాన్‌కార్డు ఆధార్‌కు లింక్ అయి ఉందో, లేదో చెక్ చేసుకునేందుకు incometaxindiaefiling.gov.in అనే ఇన్‌కమ్‌ట్యాక్స్ వారి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే వేరే పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పేరు తదితర వివరాలను నమోదు చేయాలి. అయితే రెండు కార్డులపై పేరులో ఏదైనా మార్పు ఉంటే ఏ కార్డుపై ఉన్న పేరు కరెక్టో ఆ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
Advertisement
METHOD -2 :
అయితే వెబ్‌సైట్‌లో కాకుండా SMS ద్వారా కూడా ఆ రెండు కార్డులను లింక్ చేయవచ్చు. అందుకు గాను UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నంబర్‌ను టైప్ చేసి మళ్లీ స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నంబర్‌ను టైప్ చేయాలి. అనంతరం ఆ మెసేజ్‌ను 567678 లేదా 56161 అనే నంబర్లలో ఏదో ఒక దానికి SMS చేయాలి. దీంతో రెండు కార్డులు లింక్ అయినట్లు తరువాత కొంత సేపటికి కన్‌ఫాం మెసేజ్ వస్తుంది. అయితే ఇందుకు గాను ఎలాంటి ఎస్ఎంఎస్ చార్జిలు ఉండవు. కానీ మొబైల్ ఆపరేటర్ ఆ చార్జిలను వసూలు చేస్తారు.
Advertisements
Advertisements