Advertisement
పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు…. ప్యాకెట్స్ ఏవైనా చాలా మంది ఒకే విధంగా వాడుతారు…అదెలాగంటే…కార్నర్ ను చించేసి లేదా కత్తిరించి….దీని కారణంగా ఆ కట్ చేసిన కార్నర్ పర్యావరణాన్ని పాడు చేస్తుంది!
అదెలాగంటే….సాధారణంగా పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లను లో ” పాలీ ఇథైలిన్ ” అనే ప్లాస్టిక్ తో తయారు చేస్తారు.దీనివల్ల వాటిని రీసైక్లింగ్ చేయడానికి వీలు అవుతుంది. ఈ ప్యాకెట్లు పెద్దవిగా ఉంటాయి కాబట్టి…వాటిని సేకరించి రీ సైక్లింగ్ చేయొచ్చు… కానీ కట్ చేసిన కార్నర్స్ ను సేకరించడం కష్టం…అవి రీసైక్లింగ్ కాక, డీకంపోజ్ కాక….అలాగే ఉండిపోయి….పర్యావరణ కాలుష్యానికి దారి తీస్తున్నాయి.!
Advertisement
ఒక్క బెంగుళూరు లోనే రోజుకు 30 లక్షలకు పైగా ఈ పీసులు చెత్తబుట్టలోకి వెళుతున్నాయట…అలా లెక్కేసుకుంటూ పోతే…మనం చేసే చిన్నపొరపాటు కారణంగా దేశవ్యాప్తంగా ఎంత ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు పనికిరాకుండా పోతుందో ఊహించండి!
Advertisements
ఏంచేయాలి?
ఈ ప్యాకెట్స్ ను కట్ చేసేటప్పుడు…కార్నర్ ను పూర్తిగా కాకుండా ప్యాకెట్ తో కలిసి ఉండేలా మాత్రమే కట్ చేయాలి…దీని వల్ల ఆ కార్నర్ పీస్ వేరు కాకుండా పెద్ద ప్యాకెట్ తో ఉండడం వల్ల వాటిని సేకరించడం రీసైక్లింగ్ చేయడం సులభం అవుతుంది. ప్రతి ఇంట్లో ఇలా చేస్తే సంవత్సరానికి 5000 ప్లాస్లిక్ పీసులు వాతావరణంలో కలపకుండా ఆపగలిగిన వాళ్లమౌతాం!
Advertisements