Advertisement
Zee తెలుగు ఛానల్ ఇటీవలే కొత్తగా స్టార్ట్ చేసిన సరిగమప ప్రోగ్రామ్ లో ….యశస్వి అనే కుర్రాడు జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను పాడాడు. ఈ పాటకు ఎవ్వరూ ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది! ఏకంగా జానూ మూవీ హీరో ” శర్వానంద్ ” యశస్వి పాడిన ఈ పాటపై ట్వీట్ చేసాడు. ఈ పాటతో యశస్వి ఒక్కరోజులో స్టార్ సింగర్ అయిపోయాడు! విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు అతని పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు అతని ఫ్యాన్స్!
యశస్వి కొండేపూడి వివరాలు :
యశస్వి కొండేపూడి అతనిని అందరూ “శమ్మి ” అని కూడా పిలుస్తారు . అతను కాకినాడలో జన్మించాడు , యశస్వికి చిన్నతనం నుంచే సంగీతం అంటే విపరీతమైన ప్రేమ ఉండేది, కీ బోర్డ్ కూడా చిన్నతనం నుంచే నేర్చుకున్నాడు, చిన్నప్పుడు ఒక కాంటెస్టులో ప్రముఖ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదగా అవార్డ్ కూడా తీసుకున్నాడు .
Advertisement
ప్రస్తుతం శమ్మి… ఆంధ్ర మెడికల్ కాలేజీలో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు ..త్వరలోనే డాక్టర్ గా MBBS పట్టా అందుకోబోతున్నాడు! మెడిసిన్ ఫస్ట్ ఇయర్ లోనే తను సొంతంగా YK బ్యాండ్ ను స్టార్ట్ చేసాడు. ఇతని చెల్లికూడా మంచి సింగర్
Advertisements
యశస్వికి సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అతని పాటలకు ఎప్పటి నుండో మంచి ఫాలోయింగ్ ఉంది. లైఫ్ ఆఫ్ రామ్ పాట తర్వాత అతటి యూట్యూబ్ ఛానల్స్ కు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో సబ్ స్క్రైబర్స్ పెరిగారు. ఇక 2009 నుంచి రిలేషన్ లో ఉన్న యశస్వి త్వరలోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు .
యశస్వి- లైఫ్ ఆఫ్ రామ్ పాట ( Video) :
Advertisements