Advertisement
జూమ్ అప్ వాడొద్దు అంటూ ..కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సూచించింది. ఇప్పటి వరకు అనేక వీడియో కాన్ఫరెన్స్ కోసం ఎక్కువగా ఈ అప్ నే వాడడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తులు సైతం జూమ్ అప్ ను వాడే సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని… హోమ్ శాఖా యొక్క సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ (సైకార్డ్) మార్గదర్శకాలను విడుదల చేసింది.
Advertisement
Advertisements
గూగుల్, ఆపిల్, నాసా, మరియు టెస్లా లాంటి పలు కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు జూమ్ అప్ ఉపయోగించొద్దని హెచ్చరించాయి. జర్మని మరియు తైవాన్ కూడా తమ దేశాలలో జూమ్ వాడకాన్ని నిషేధించాయి. ఇటీవల జూమ్ యాప్ భద్రత మరియు గోప్యత లోపాలు వెలుగులోకి వచ్చిన తరువాత చాల దేశాలు ఈ నిర్ణయం వైపుగా ఆలోచిస్తున్నాయి. జూమ్ యాప్ కు 200 మిలియన్ల మంది వినియోగదారులున్నారు. భారతదేశంలో గత రెండు వారాల్లో ఈ యాప్ ను సుమారు 450,000 డౌన్‌లోడ్ చేసుకున్నారు. జూమ్ CEO ఎరిక్ ఎస్. యువాన్ భద్రతా లోపాలకు క్షమాపణలు చెప్పారు.
Advertisements